హైదరాబాద్, పిఐబి, జనవరి 02 : కోల్ ఇండియా లిమిటెడ్(సిఐఎల్), ఎస్సిసిఎల్ కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ 330 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో అదనపు 19 తొలి మైలు అనుసంధానం(ఎఫ్ఎంసి) ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులను ఆర్థిక సంవత్సరం 26-27 నాటికి అమలు జరుగనున్నాయి. మంత్రిత్వ శాఖ 526 ఎంటిపిఎ సామర్థ్యం, రూ. 18000 కోట్ల పెట్టుబడితో 55 ఎఫ్ఎంసి ప్రాజెక్టులు(44-సిఐఎల్, 5-ఎస్సిసిఎల్, 3 – ఎన్ఎల్సిఐఎల్) ను చేపట్టింది. ఇందులో 95.5 ఎంటిపిఎ సామర్ధ్యంతో ఎనిమిది ప్రాజెక్టులను ప్రారంభించగా, మిగిలినవి ఆర్థిక సంవత్సరం 2025లో ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన బొగ్గు తవ్వకం, తరలించేందుకు, మంత్రిత్వ శాఖ బొగ్గు గనుల సమీపంలో ఉన్న రైల్వేసైడింగ్స్ ద్వారా ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, బొగ్గు క్షేత్రాలలో రైల్ నెట్వర్క్ను బలోపేతం చేయడం సహా నేషనల్ కోల్ లాజిస్టిక్ ప్లాన్ (జాతీయ బొగ్గ వ్యూహ ప్రణాళిక)ను అభివృద్ధి చేసేందుకు పని చేస్తుంది.
ఆర్థిక సంవత్సరం 25కు 1.31 బిలియన్ టన్నుల బొగ్గును, ఆర్థిక సంవత్సరం 30 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో కూడిన, వేగవంతమైన, పర్యావరణ అనుకూల పద్ధతిలో బొగ్గు రవాణాను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎఫ్ఎంసి కింద యాంత్రిక బొగ్గు రవాణాను, లోడింగ్ వ్యవస్థను అధునాతనం చేసేందుకు చర్యలు చేపట్టడమే కాక, గనులలో బొగ్గును రవాణా చేసేందుకు రోడ్డు రవాణాను తొలగించేందుకు సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రిత్వ శాఖ వ్యూహాన్ని రూపొందించింది. వేగవంతమైన సరుకు నింపే వ్యవస్థలతో కూడిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు(సిహెచ్పిలు), ఎస్ఐఎల్ఒలకు బొగ్గును దంచడం, దానిని పరిమాణానికి అనుగుణంగా చేయడం, వేగవంతమైన కంప్యూటర్ మద్దతుతో సరుకు నింపడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఇఇఆర్ఐ), నాగ్పూర్ ద్వారా 2020-21లో అధ్యయనాన్ని చేపట్టారు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఏడాదీ కర్బన ఉద్గారాలను మితం చేయడం, ట్రక్కుల కదలికల సాంద్రత తగ్గింపు, ఏడాదికి రూ. 2100 కోట్ల విలువైన డీజిల్ ఆదా చేయడం జరుగుతుందని ఎన్ఇఇఆర్ఐ నివేదిక నిర్ధారించింది.