Take a fresh look at your lifestyle.

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి

State Municipal Affairs Minister KTR
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

‌ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పనులు కొనసాగిస్తేనే అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు,మండల ప్రజాప్రతినిధులు,జడ్పీ ప్రజాప్రతినిధులతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సిరిసిల్లలో, వేములవాడ,సిరిసిల్ల పట్టణాల ప్రతినిధు)తో వేములవాడలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని వేము)వాడలో నిర్వహించగా మంత్రి కెటిఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులంతా ప్రజలకు ఎల్లవేళలా సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని,ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకాన్ని ప్రజలకు అందేట్లుగా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు తమ పట్టణాలను,గ్రామాలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందించుకోవాలని సూచించారు.

ఈ సమావేశాల్లో జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ,ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌,‌సుంక రవిశంకర్‌,ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు,టెస్యాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు,సెస్‌ ‌చైర్మన్‌ ‌లక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల సిరిసిల్లలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని మంత్రి కెటిఆర్‌ ‌గుర్తుంచుకుని ఈ హాస్టల్‌ ‌సందర్శించి,బాలికలతో మాట్లాడి,వారికి తగిన న్యాయం జరిగేట్లుగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply