
మహబూబాబాద్ టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అందిస్తున్న వైద్యంపై రోగులకు అడిగారు. ఆసుపత్రిలో ని వివిధ విభాగాలైన ఎస్ఎన్ సీయూ, ఐ సీయూ, ఎఎన్సీ, ఫార్మసీలను సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు., ప్రత్యేక నిపుణుల డాక్టర్ల వివరాలు చార్ట్ లో పరిశీలించి వెంటనే నవీకరించి తెలుగు భాషలో ప్రదర్శించాలని ఆదేశించారు.
పిల్లలకు టీకాలు వేయించుటకు వచ్చిన బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు చేయించుకున్న ఆరోగ్య చేకప్ లను ఆశా వర్కర్లు ల అప్ డేట్ చేసుకోవాలని గర్భిణి స్త్రీ ల పూర్తి సమాచారం ఉంచుకోవలన్నారు. ఫార్మసీలో ప్రతి ఔషధం ‘‘ఈ’’ ఔషధి ద్వారానే జరగాలన్నారు. రోగులకు అందిస్తున్న మందులను పరిశీ లించారు. ఆసుపత్రిలోని ల్యాబ్స్ లో ఎలిసా, డెంగ్యూ పరీక్షలు జరగడం లేదని దృష్టికి రాగా, అందుకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు వెం టనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీ రాం, డిప్యూటీ డిఎం అండ్ హెచోఓ అంబరీష్,డాక్టర్లు వెంకట్రాములు, జగదీష్, కృష్ణార్జున్ పాల్గొన్నారు.