Take a fresh look at your lifestyle.

పునరావాస కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

అధికారులను ఆదేశించిన  కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌యంవి రెడ్డి

వరదముంపుకు గురైన లోతట్టు ప్రాంత ప్రజలకు పునరాసకేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌యంవి రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ‌గోదావరి స్నానఘట్టాలు, విస్తారాంపై లక్సు, సుభాష్‌ ‌నగర్‌, ‌డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లును పర్యవేక్షించారు. వరద ఉధృతి 65 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ‌సూచన మేరకు ముంపు నుండి ప్రజలను రక్షించేందుకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరదలు ఏ సమయంలో ముంచెత్తు తుందో తెలియని పరిస్థితి కాబట్టి ప్రజలు రాత్రి సమయాల్లో పునరావాస కేంద్రాలకు క్లాలంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నదా ముందుగానే ప్రమాదాన్ని గుర్తెరిగో పునరావాస కేంద్రాలకు రావాలని ఆయన ప్రజలను కోరారు. గోదావరి పరివాహక మండలాలైన చర్ల, దుమ్ముగూడెం భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాకల్లో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని ఇంకనూ ఈ సాయంత్రానికి మరో 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు మంచి ఆహారంతో పాటు ఉదయం సాయంత్రం అల్పాహారాన్ని అందచేయలని చెప్పారు కష్టాల్లో ఉన్న ప్రజలకు కడుపునిండా అన్నం కూడా పెట్టకపోతే మహాపాపం కలుగుతుందని ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు.

వసతులు లేవని, ఆహారం కూడా మంచిగా పెట్టడం లేదనే సమస్యలు వస్తే తక్షణం సంబంధిత అధికారులను సస్పెండ్‌ ‌చేస్తానని హెచ్చరించారు. పునరావాస కేంద్రాలకు ప్రజలను తీసుకురావడం వరద తగ్గిన తరువాత వారిని క్షేమంగా ఇల్లు చేర్చడం ప్రభుత్వాధికారులుగా మన బాధ్యత చెప్పారు. ఎగువనున్న ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నందున దాదాపు 17 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరికి వస్తుందని ఈ పరిస్థితులను గమనంలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఇస్తున్న సలహాలు, సూచనలు ప్రజలు తప్పక పాటించాలని ఆయన సూచించారు. గ్రామస్థాయి నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ట్రాక్టర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముంపు వచ్చే వరకు ప్రజలు వేచి ఉండకుండా వచ్చిన తరువాత ఆదరాబాదరా ప్రమదంతో బయటకు వచ్చే కంటే ముందుగానే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని ఆయన చెప్పారు. విస్తాకాంప్లెక్సు వద్ద చేరిన నీటిని గోదావరిలోకి తరలించేందుకు అదనంగా మోటార్లు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. సుభాష్‌ ‌నగరలో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని అవగాహన కల్పించారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రతి పునరావాస కేంద్రానికి ఒక నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు.

పునరావాస కేంద్రంలో ఉన్న వ్యక్తులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. కరోనా వ్యాధి అనుమానితులుంటే వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచాలని చెప్పారు. కేంద్రాల్లో నిరంతరా యంగా విద్యుత్‌ ‌సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుద్య కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉండాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అపరిశుభ్రత వల్ల విషపు జంతువులు వచ్చే అవకాశం ఉందని నిరంతర పర్యవేక్షణ జరగాలని చెప్పారు. సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. సమయం దాదాపు రెండు గంటలు కావస్తున్నా భోజనం సిద్ధం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులను సస్పెండ్‌ ‌చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రజలకు మనం అండగా ఉండకపోతే ఎలా, సమయాను కూలం గా ఆహారాన్ని అందించకపోతే చిన్నారులు, వయోవృద్ధులు ఇబ్బందులు పడుతుంటారని సమయపాలన పాటించాలని అధికారులను దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన లాంచీ యజమానులు ఆయా మండలాలకు వెళ్లడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారి లైసెన్సులు రద్దు చేసి లాంచీలను సీజ్‌ ‌చేయాలని ఆర్డీవో ఆదేశించారు. వెళ్లడానికి ఏం ఇబ్బంది వచ్చిందని లాంచీ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు వరద నుండి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు లాంచీలు ఏర్పాటు చేస్తే కహానీలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో జడ్పీ సిఈఓ పురుషోత్తం, డిపి రమాకాంత్‌, ‌సబ్‌ ‌కలెక్టర్‌ ‌స్వర్ణలత, ప్రత్యేక అధికారివిజేత, తహసిల్దార్‌ ‌నాగేశ్వరావు పాల్గొన్నారు.

 

Leave a Reply