రెండిళ్లలలో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు సివిల్ సప్లై డిప్యూటి తహశీల్దారు వెంకటేశ్వర్లు గురువారం సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని రెండు ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న సమాచారం అందుకున్న ఆయన తన సిబ్బందితో ఉదయం దాడులు నిర్వహించటం జరిగింది. ఈ దాడుల్లో ఒక ఇంట్లో 16, మరో ఇంట్లో 17 సిలిండర్లు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని సీజ్ చేయటం జరిగిందన్నారు. ఆ రెండిళ్ళ కు సంబంధించిన యజమానులపై కేసులు నమోదు చేయటం జరిగిందని సివిల్ సప్లై డిప్యూ• •తహశీల్దారు వెంకటేశ్వర్లు తెలిపారు.