Take a fresh look at your lifestyle.

తుళ్లూరులో 144 సెక్షన్‌ ‌విధింపు

  • అనుమతి లేకుండా ర్యాలీల నిషేధం
  • జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను అడ్డుకున్న పోలీసులు
  • పోటాపోటీగా ఆందోళనకు దిగిన వైసిపి కార్యకర్తలు

అమరావతి,మే13 : అమరావతి ప్రాంత తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్‌ ‌విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు చేస్తున్నారంటూ జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్‌ ‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఆందోళనల నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరులో పోలీసలు అలర్ట్ అయ్యారు. హై సెక్యూరిటి జోన్‌ ‌పరిధిలో ముందస్తుగా అనుమతులు లేకుండా నిరసనలు, ఆందోళనలు చేపట్టటంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అంబేడ్కర్‌ ‌స్మ•తివనం వరకు జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ ‌పాదయాత్ర తలపెట్టారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జడ శ్రవణ్‌ ‌కుమార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. దళితులను అడ్డంగా పెట్టుకొని రాజధాని భూముల విషయంలో వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమాయకులను వంచించి మోసగిస్తోందని జడ శ్రవణ్‌ ‌కుమార్‌ ఆరోపించారు. అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జడా శ్రావణ్‌ ‌కుమార్‌ ‌హోటల్‌ ‌నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయన్ని రౌండప్‌ ‌చేశారు. అనుమతి లేదంటూ అరెస్టు చేసిన పోలీసులు, అక్కడ నుంచి నున్న పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు తరలించారు.

ప్రభుత్వం, పోలీసులు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడా శ్రావణ్‌, ‌వైఫల్యాలు బయటపడతాయనే తమను అరెస్ట్ ‌చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని చెప్పారు. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని, ఆర్‌ 5 ‌జోన్‌ ‌పై ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తుందన్నారు. రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే తప్పేంటిని ప్రశ్నించారు. జీవో నంబర్‌ ఒన్‌ ‌రద్దు చేసినా తనను ఎలా అరెస్టు చేస్తారని జడ శ్రవణ్‌ అన్నారు.అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నానని అన్నారు. జైలులో పెట్టినా, ఆస్పత్రిలో ఉన్నా దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ అరెస్టుపై సిఎం స్వయంగా స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజాస్వామ్యమా, రాచరికమా అనేది జగన్మోహన్‌ ‌రెడ్డి చెప్పాలని, రైతులకు మద్దతు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో నేరమా అని ప్రశ్నించారు. తనకు ఏ విధమైన నోటీస్‌ ఇవ్వకుండా అరెస్టు చేశారని, నేటి నుంచి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌ ‌డౌన్‌ ‌ప్రారంభం అయ్యిందన్నారు. జగన్మోహన్‌ ‌రెడ్డి దిగి వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.

పోటాపోటీగా వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌ర్యాలీ
ఇదిలావుంటే రాజధాని ప్రాంతంలో జడా శ్రవణ్‌ ‌పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయనకు పోటీగా వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు కూడా ర్యాలీని తలపెట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన నేతలు ర్యాలీకి దిగటంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రెండు నిరసన కార్యక్రమాలు తలపెట్టటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా తుళ్ళూరు ప్రాంతంలో 144సెక్షన్‌ అమలులోకి తీసుకువచ్చారు. వరుస ఆందోళనలు నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా చెక్‌ ‌పోస్ట్ ఏర్పాటు చేశారు.
హై సెక్యూరిటి జోన్‌లో అనుమతి లేకుండా, ఎలాంటి నిరసనలు తలపెట్టినా చర్యలు కఠినంగా ఉంటాయని
పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply