Take a fresh look at your lifestyle.

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’

అటవీ హక్కుల చట్టం 2006 ద్వారా ఆదివాసులు, సంప్రదాయ అటవీ వాసులకు 10 కోట్ల ఎకరాలకు హక్కులు లభిస్తాయనీ, దేశంలోనే 4వ వంతు గ్రామాలు 1,70,000 గ్రామాల్లోని 20 కోట్ల మందికి, అందులో 9 కోట్ల మంది ఆదివాసులకు ప్రయోజనం కలుగుతుందనీ అంచనా వేశారు. చట్టాన్ని గురించి ఎంత గొప్పగా చెబుతున్నప్పటికీ దాని అమలు అత్యంత అధ్వానంగా ఉంది. చట్టంలో పేర్కొన్న 14 హక్కుల్లో నివాసాలు పోడు సాగు భూముల హక్కులకు అమలును మొక్కుబడికి పరిమితం చేశారు. అవి కూడా అరకోరగానే అమలు జరిగాయి. పైగా మొత్తం చట్టాన్ని అన్నిచోట్ల తప్పుగా వ్యాఖ్యానించి అమలును నీరు కార్చుట జరిగింది. అటవీ హక్కుల చట్టం కేవలం షెడ్యూల్ల ప్రాంతానికే వర్తిస్తుందని , ఆదివాసులకు మాత్రమే వర్తిస్తుందనే వాదనలు పూర్తిగా తప్పు.  ఈ చట్టం దేశవ్యాప్తంగా మొత్తం అడవి ప్రాంతాల్లోని ఆదివాసులు, సాంప్రదాయకంగా అడవుల్లో ఆదివాసేతరులు 2005 డిసెంబర్‌ 13 ‌నాటికి 75 సంవత్సరాలు నుంచి నివాసం ఉంటున్న అందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఆదివాసేతరుల ఆధీనంలో 75 సంవత్సరాల నుండి ఉన్న పోడు భూములు మాత్రమే హక్కు పత్రాలకు అర్హులు అనేది మరో తప్పుడు వాదన. హక్కుల విషయంలో ఒక విషయం ఆదివాసీతరులు 75 సంవత్సరాలుగా ఉంటున్న వారికే హక్కులు వర్తిస్తాయని విషయంలో తప్ప, వేరే ఏ విషయంలోనూ అటవీ హక్కుల చట్టం తేడా చూపడం లేదు. పై విధంగా చట్టాన్ని తప్పుగా వక్రీకరించి లక్షలాదిమంది ఆదివాసేతరుల దరఖాస్తులను  అక్రమంగా తిరస్కరించుట జరి గింది. అటవీ హక్కుల చట్టం వచ్చి దాదాపు 17 సంవ త్సరాలు, అమలు ప్రారంభమై 15 సంవత్సరాలు కావస్తున్న ప్పటికీ నేటికీ పూర్తిగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సక్రమంగా అమలు జరగలేదు. ప్రస్తుతం చట్టం ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అటవీ ప్రాంతాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదాల్లోనున్న 10 లక్షల ఎకరాల భూమి  వివాదాలను పరిష్కరించి ,పేదలకు పంచాలని 2008 సంవత్సరంలోనే కోనేరు రంగారావు ఆధ్వర్యంలోనీ భూ కమిటీ చేసిన సిఫారసు అమలు నేటికీ అతి గతి లేదు.
దేశంలో 30 జూన్‌ 2022 ‌వరకు మొత్తం వ్యక్తిగత పోడు భూమి కొరకు 42, 76 ,844 మంది దరఖాస్తులు పెట్టుకోగా 21,33,260- 49.88% మందికి మాత్రమే 18,40,560 హెక్టార్ల భూమికి హక్కు పత్రాలు ఇచ్చారని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2,06, 984 మంది అర్జీలు పెట్టుకోగా 97,434 47.12% మందికి 3,14,580 ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చారు. సగటున ఒక్కో కుటుంబానికి దేశంలో 2.16 సెంట్లు, తెలంగాణలో 3.23 సెంట్ల భూమికి మాత్రమే హక్కు పత్రాలు లభించాయి. హక్కులు లభించిన వారిలో 84.33% షెడ్యూల్డ్ ‌ప్రాంతంలోని వారు. వీరు హక్కు పత్రాలు లభించిన భూమిలో 94.72% పొందారు. అందజేసిన మొత్తం హక్కు పత్రాలలో దాదాపు 88% యూపీఏ (2008- 2014) 6 1/2 సంవత్సరాల కాలంలో లభించగా మోడీ ప్రభుత్వం 2014- 2022 మధ్య ఎనిమిది సంవత్సరాలకు పైగా కాలంలో కేవలం 12%  మాత్రమే లభించాయి. అటవీ హక్కుల చట్టం వల్ల విస్తీర్ణం తగ్గి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుందనే ప్రచారం వాస్తవ కాదని ఋజువు అవుతోంది.
రాష్ట్రంలో ప్రచారానికి, వాగ్దానాలకు పరిమితమైన అటవీ హక్కుల చట్టం.
image.png
కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. అటవీ పునరుద్ధరణ నిధి 2016 ద్వారా నిధులను వినియోగించి.2018 బి19, 2020బి21 మధ్య 3 సంవత్సరాల కాలంలో 36,53,935 ఎకరాల పోడు భూముల నుండి ఆదివాసులు, సంప్రదాయ అటవీ వాసులను  ఖాళీ చేయించడం జరిగింది. దేశంలో ఖాళీ చేయించిన మొత్తం పోడు భూముల్లో 23.65% తెలంగాణలోనే వున్నాయి. పోడు భూములు ఖాళీ చేయించి,అడవులు పెంచాలనే నిబంధన ఏ చట్టంలోనూ లేదు. పైగా పోడు భూముల హక్కుల పరిశీలన పూర్తయ్యేంతవరకు ఏ అర్జీదారునీ పోడు భూముల తొలగించరాదని అటవీ హక్కుల చట్టం లోని నిబంధన 4(5)  స్పష్టంగా నీరేశి స్తోంది అంతేకాక 28బి2బి2022 న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో’’పోడు భూముల పరిశీలన పూర్తయిన తర్వాత,దాని రికార్డులు తమకు సమర్పించాలని,వీటిని సుప్రీం కోర్టు పరిశీలించే వరకూ,తిరస్కరించబడిన  అర్జిదారులను అటవీ భూముల నుండి తొలగించడాన్ని నిలిపి వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. అయినప్పటికీ, అటవీ హక్కుల చట్టానికీ,సుప్రీంకోర్టు తీర్పుకూ వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల నుండి గెంటివేత కొనసాగుతూనే వుంది.ప్రభుత్వ తీవ్ర నిర్భందం, తప్పుడు కేసుల బనాయింపు, ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.
అటవీ హక్కుల చట్టం 2006 అమలుకు సంబంధించిన నివేదికను ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖకు పంపించాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన నివేదికలను కేంద్రానికి పంపించడం లేదు. అఖిలపక్షం ఆందోళన ఫలితంగా గత సంవత్సరం చివరి మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 13,18, 971 ఎకరాల పోడు భూమికి సంబంధించిన 5,03,469 ఆర్జీలు వచ్చాయనీ,అందులో 4.8 లక్షలు పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, వీటిలో ఎన్ని ఆర్జీలు ఆమోదించిందీ తెలియదు. వివరాలు ఏవీ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రకటించిన దానిలో లేవు. ప్రజల ఐక్య ఆందోళన ఫలితంగా, గత సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీలో ‘‘పోడు భూముల కార్యచరణ’’ను కెసిఆర్‌ ‌ప్రకటించాడు.ఈ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌ ‌సైట్‌ ‌లో 10 అక్టోబర్‌ 2021 ‌న ఉంచారు. అందులో ‘‘ అడవుల నడిమధ్యలో సాగుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి,అడవి అంచునభూమిని కేటాయిస్తాం.
ఆ  విధంగా తరలిచినా వారికీ సర్టిఫికెట్లు ఇచ్చి,  వ్యవసాయానికి నీటి సౌకర్యం,కరెంటు వంటి వసతులు కల్పించి రైతుబంధు,రైతు భీమాను కూడా వర్తింప చేస్తాం అని కెసిఆర్‌ ‌ప్రకటించారు. పోడు భూములకు 2014 జూన్‌ ‌వరకు పరిశీలించి, వన్‌ ‌టైం సెటిల్మెంట్‌ ( ఒకేసారి పరిష్కారం) చేస్తామని కూడా కేసీఆర్‌ ‌ప్రకటించారు. అయితే, ఈ స్ఫూర్తికి భిన్నంగా మంత్రి కే. టీ. ఆర్‌ ‌మాట్లాడాడు. పోడు భూములకు మార్చాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్రం అంగీకరించగానే పోడు భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తూందనీ ఈ వైఖరి కేంద్ర ప్రభుత్వంపై నెపం నేటి, తప్పుకోటానికి ప్రయత్నించే రాజకీయ ఎత్తుగడ తప్పు, ఆదివాసులకు భూములు దక్కించేది కాదు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి జిల్లా సామాన్య కమిటీలు ఏర్పరచడానికి జీవో నెంబర్‌ 140‌ని  111-9బి2022ను విడుదల చేసినట్లుగా, కేసీఆర్‌ ‌చేస్తున్న ప్రచారం మోసపూరితమైంది. అడవి హక్కుల చట్టం కు  పూర్తిగా వ్యతిరేకమైన. అటవీ హక్కుల చట్టం ప్రకారం  జిల్లా, డివిజన్‌, ‌సబ్‌ ‌డివిజన్‌ ‌కమిటీలు రాష్ట్ర రెవెన్యూ,అటవీ,గిరిజన శాఖల అధికారులు, పంచాయితీ రాజ్‌ ‌సంస్థల నుండి ముగ్గురు సభ్యులతో రాష్ట్రస్థాయిలో చీఫ్‌ ‌సెక్రటరీ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, ‌సబ్‌ ‌డివిజన్‌ ‌స్థాయిలో ఆర్డీవోలు, చైర్మన్‌ ‌లుగా కమిటీలు ఏర్పాటు చేయాలని అటవీ హక్కుల చట్టం నిర్దేశిస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా జిల్లా ఇన్చార్జ్ ‌మంత్రి చైర్మన్‌ ‌గా, మొదటి అధికార సభ్యులుగా జిల్లా ఎస్పీ ,ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ ,ఎమ్మెల్యే జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌, ఇతర ప్రత్యేక ఆహ్వానితులతో జిల్లా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని 140 జీవో పేర్కొంటుంది. ఈ కమిటీల మొదటి కర్తవ్యం అడవులను కాపాడుట, సంరక్షించుట, అటవీ భూములు ఆక్రమించకుండా ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. వాస్తవంగా అటవీ సంరక్షణ పేరిట ఏర్పరిచిన పోడు భూముల వ్యతిరేక కమిటీలు ఇవి. అందువల్లనే జిల్లా సమన్వయ కమిటీలు పనిచేయటాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు 23 సెప్టెంబర్‌ 2022‌న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మెడ మీద కత్తిలా వేలాడుతున్న సుప్రీంకోర్టు తీర్పు
image.png
అటవీ హక్కుల చట్టం అమలులోకి రాకముందే దానికి వ్యతిరేకంగా అడవుల పర్యావరణ రక్షణ పేరిట వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. అటవీ హక్కుల పద్దతును సవాల్‌ ‌చేస్తూ 2008 సంవత్సరం ప్రారంభంలోనే సుప్రీంకోర్టులో కేసులు వేశారు. కేసు విచారణలో భాగంగానే దరఖాస్తులు తిరస్కరించబడిన వారికి భూమిపై హక్కులు లేవని వాటిని అక్రమ ఆక్రమణలుగా పేర్కొని, వారిని భూముల నుండి ఖాళీ చేయించాలని 13 ఫిబ్రవరి 2019న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దేనికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భూముల నుండి ఖాళీ చేయించాలనే తీర్పు నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మోడీ ప్రభుత్వం అఫీడవిట్‌ ‌దాఖలు చేసింది. వోడు భూముల నుండి ఖాళీ చేయించాలని గత తీర్పును నిలుపుదల చేస్తూ 28 ఫిబ్రవరి 2019 సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. పోడు భూముల దరఖాస్తులు తిరస్కరించినప్పుడు దానికి గల కారణాలతో సహా అర్జీదారులకు తెలియజేయాలని పై కమిటీలకు అప్పులు చేసుకునే అవకాశం కల్పించాలని ,అప్పుడు తిరస్కరించిన అర్జీదారుల రికార్డు మొత్తం సుప్రీంకోర్టుకు రాష్ట్రాలు అందజేయాలనీ, ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కాకుండా పోడు భూముల నుండి ఎవరిని వెళ్లగొట్ట రాదని తన తీర్పులో పేర్కొన్నది. అయితే ఇంతవరకు రాష్ట్రాలు వీరికి సంబంధించిన సమాచారం సుప్రీంకోర్టుకు అందజేయలేదు. ఇదే విషయం 17 సెప్టెంబర్‌ 2022‌న విచారణకు రాగా, దీపావళి పండుగ తర్వాత విచారణ చేపడతామని ప్రకటించింది. పోడు భూములకు హక్కు పత్రాలు లభించని వారు నేటికీ అటవీ భూముల నుండి గెంటివేత ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు.
పోడు భూములు హక్కులతో సహా అటవీ హక్కులను కాలరాసే అటవీ సంరక్షణ నియమాలు 2022
మోడీ ప్రభుత్వం తెస్తున్న అటవీ రక్షణ నియమాలు 2022 .అటవీ హక్కుల చట్టం ద్వారా ఆదివాసులు సంప్రదాయ ఆదివాసేతర ప్రజలకు లభించిన హక్కులకు గ్రామసభల అనుమతి లేకుండా చేస్తాయి. పోడు భూములకు అటవీ భూములకు గ్రామ సభలతో సంబంధం ఉండదు. పోడు భూములకు చట్టబద్ధహక్కులు రద్దయి, ప్రభుత్వ దయాదాక్షిన్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. సూటిగా చెప్పాలంటే 2006 అటవీ హక్కుల నిర్వీర్యం అవుతుంది. అటవీ హక్కుల చట్టం దాని అమలు చేసే నోడల్‌ ఏజెన్సీగా ఉన్న కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ,షెడ్యూల్‌ ‌ప్రాంతాల చట్టాలు, పీసా చట్టం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, పునరావాస  పరిహార చట్టం 2013 ద్వారా ఆదివాసులకు లభిస్తున్న హక్కులకు వ్యతిరేకమైనవి మోడీ తెస్తున్న అటవీ నియమాలు, రాష్ట్రాల హక్కులను కూడా దెబ్బతీస్తాయి. ఈ నియమాలు సూటిగా చెప్పాలంటే మోడీ తెస్తున్న అడవి సంరక్షణ నియమాలు 2022  ఆదివాసుల అటవీ హక్కులు కాలరాచి, అడవుల్ని, అటవీ భూగర్భ వనరు వనరుల్నీ కార్పోరేట్లకు ద్వారా దత్తం చేయుటకు అడవులు ,పర్యావరణం వినాశనానికి దారి తీస్తాయి.
బిజెపి 2019 ఎన్నికల ప్రణాళికలో ‘‘మేము అడవులలో నివాసం ఉంటున్న వారి హక్కులన్నీటికి పూర్తిగా రక్షణ కల్పిస్తామని’’ మరోవైపు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ 2018 ఎన్నికల ప్రణాళికలో ‘‘ సాధ్యమైనంత తొందరలో పోడు భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరిస్తాం. వీరికి ఇతర రైతులతో సమానంగా ప్రయోజనాలు అందిస్తాం’’అని ప్రకటించాయి. కానీ ఆచరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అటవీ హక్కుల చట్టం అమలును నీరుగార్చాయి. మోడీ ప్రభుత్వం కొత్తగా హక్కులు ఇవ్వకపోగా ఉన్న చట్టాలను అమలు చేయకపోగా ఉన్న హక్కులపై అప్రకటిత యుద్ధానికి పూనుకుంది. పోరాటాలు ఉద్యమాలు లేకుండా హక్కులు రాలేదు. వచ్చిన హక్కులు కూడా అమలు కావు. సమస్యల పరిష్కారం అంతకంటే కాదు. అల్లూరి, కొమరం భీమ్‌, ‌బిర్సా ముండా తదితర నాయకుల ఆధ్వర్యంలో గతం నుండి పోరాడిన సంప్రదాయం ఉంది. గత ఏడాది ఒక సంవత్సరం పైగా దేశ రైతాంగం, ప్రత్యేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఐక్యంగా ఉద్యమించి మోడీ మెడలు వంచి మూడు కార్పోరేట్‌ ‌వ్యవసాయ చట్టాలు రద్దు చేయించి మార్గాన్ని చూపి స్ఫూర్తిగా నిలిచారు. అటవీ హక్కుల రక్షణ కోసం, పోడు భూములకు హక్కు పత్రాల కోసం, అటవీ సంరక్షణ నియమాలు 2022ను ఉపసంహరించాలని డిమాండ్‌ ‌చేస్తూ అటవీ పుత్రులు, ఆదివాసులు, ఆదివాసేతరులు ఐక్యంగా ఉద్యమించాలి.
– వేములపల్లి వెంకట్రామయ్య, AIKMS జాతీయ అధ్యక్షులు
8639873720

Leave a Reply