Take a fresh look at your lifestyle.

ఉద్యోగ, నిరుద్యోగుల హామీలను అమలు చేయండి..!

తెలంగాణ స్వరాష్ట్ర పోరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగయువత, విద్యార్థులు ఉద్యమసారధులు చేసే ప్రతి పోరాటంలో బరిగీసి కొట్లాడిండ్లు. మూడు తరాల తండ్లాట ఆత్మగౌరవ పాలనలో మా బతుకులు బాగుపడతాయని, రాష్ట్రం ఆవిర్భవించాక అంత్యంత నిరాదరణకు గురైన వర్గాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు  కాగా, కోవిడ్‌ ‌ముందు, ఆ తర్వాత నిర్లక్ష్యానికిలోనైన రంగం విద్యారంగమేనని ఎవరు అవునన్నా, కాదన్నా అనుభవాలే సాక్ష్యాలుగా రుజువౌతున్నాయి. విద్యారంగానికి ప్రభుత్వ బడ్జెట్‌ ‌కేటాయింపులు పెంచకపోగా ప్రైవేట్‌ ‌రంగాన్ని ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి. ప్రైవేట్‌ ‌పాఠశాలలకు, కళాశాలలకు, యూనివర్సిటీ(విశ్వవిద్యాలయా)లకు అనుమతులు ఇస్తుంది కాదనగలరా ! దీని మూలంగా ప్రభుత్వ విద్యారంగం కోలుకోలేని విధంగా దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడుతుంది. అంటే ప్రజలకు ఉచిత విద్య అనేది పగటి కలగానే మిగులుతుంది. ప్రైవేటు, కాంట్రాక్టు నియామకాల పేరుతో వెట్టిచాకిరి లేకుండా అందరిని రెగ్యులరైజ్‌ ‌చేసి స్వయంపాలనలో ప్రభుత్వ ఉద్యోగులు గానే నియమిస్తామన్న మాటలు నెరవేరకపోగా నియామకాల జాడ లేదాయె. ఎన్నికల్లో నిరుద్యోగ భృతి వాగ్ధానం నేటికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిష్క•తంగా కొండవీడు చాంతాడుగా మారుతుంది నిజం కాదా ! గతంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలతో సాధించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులు ఒక్కొక్కటిగా కోల్పోతున్నారు. నేటి పాలకుల, ఉద్యమ నాయకుల స్వార్థపూరిత విధానాల మూలంగానేనని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేధన చెందుతున్నారు. 16 మే 2018న స్వయానా ఉద్యమనేతే, పాలానాధినేత 18 డిమాండ్లతో పాటు జూన్‌ 2‌న ఐ.ఆర్‌. ఇస్తానని, మూడు నెలల్లో పి.ఆర్‌.‌సి. నివేదిక తెప్పించుకుని ఆగష్టు 15నుకు పి.ఆర్‌.‌సి. అమలు చేస్తామన్న  రాత పూర్వక హామీ నేటికి అమలుకు నోచుకోక పోగా పి.ఆర్‌.‌సి. కమీషన్‌ ‌గడువును పెంచుకుంటూ పోవడం భావ్యమా ! కరోనా వేళ ఆర్థికంగా గడ్డు పరిస్థితులు రాష్ట్రంలోని ఏ రంగానికి లేనిది, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగానికి వచ్చిందా ! ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లు పెంచుతామన్న మాట దాని ఊసెత్తకుండా ఉద్యోగులు, నిరుద్యోగులు వద్దంటున్నారని ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించేలా చూడడం హామీ ఇచ్చేటప్పుడు గుర్తులేదా ! ఇలా అనేక విదాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాలను నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురిచేయడం ఆత్మ గౌరవ పాలనకు నిదర్శనమౌతుందా ! ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అం‌టే సమస్యను చాంతాడంత పెంచడం కాదని గమనించండి.

 

ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు అపరిష్క•తమైన సమస్యల వలయంలో విలవిలలాడుతున్నారు. ఉద్యోగ, ఉపాద్యాయ వర్గాలకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికైనా అంటే ! పి.ఆర్‌.‌సి. గడువు ఈ 2020 డిసెంబర్‌తో ముగియబోతున్నందున పాలకుల్లో ఉలుకు పలుకు లేకపోవడంతో మరోవైపు సమస్యల పరిష్కారానికై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పోరుబాట పట్టినారు. మళ్లీ గడువును పెంచకుండా న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉందని గమనించండి. పోరాటాలను, ఉద్యమాలను అణిచి వేయాలని చూడడం ఆత్మగౌరవ పాలకులకు ఎంతమాత్రం క్షేమం కాదు. 11వ వేతన సవరణ అమలు చేస్తానని ముఖ్యమంత్రి హామీల ఆశ(భ్రమ)లో పడి ఉద్యోగ, ఉపాధ్యాయులు గృహ, వ్యక్తిగత, విద్యా, వివాహాది ఋణాలు తీసుకొని ఇప్పుడు వస్తున్న అరకొర వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా విజృంభన ఒకవైపు ఆరోగ్యశ్రీ లేకపోగా హెల్త్ ‌కార్డులు, మెడికల్‌ ‌రీయాంబర్స్‌మెంట్‌ ‌వర్తించకపోగా ఆరోగ్య రక్షణ కోసం ఖర్చులు పెరిగి కుటుంబాల్లో అశాంతి, కలహాలకు తోడుగా ఒకటో తారీఖున జీతాలు రాక, సగం జీతాలతో కొన్నాళ్లు అప్పులు, చేబదల్ల దుర్బర స్థితికి తోడు, నీకేంది ఉద్యోగివి అనే సమాజపు ఎత్తి పొడుపుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రధాన భూమిక పోషించి ప్రజలను చైతన్య పరచినారు. ఆ వర్గాల వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిరాధరణకు గురౌతున్నారు. రేపటి ఓట్ల కోసం పాలన కాకుండా రేపటి తరం కోసం పాలన సాగాలి అనే విధంగా ఆత్మగౌరవ పాలనకు పూనుకోవాల్సి ఉంది. కాలం గడపడానికి ఎన్నో మార్గాలు, కానీ గడిచిపోయిన కాలాన్ని తిరిగి (వెనక్కి) తీసుకువచ్చే మార్గం ఒక్కటి కూడా లేదు. కావున ముఖ్యమంత్రి వెంటనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. గత ఐదేళ్ల పాలనలో మీ ప్రాదాన్యత రంగాలు నీరు, వ్యవసాయం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పాలకులకు తోడుగా ఉండి ఉద్యోగులు నిబద్ధతతో వారి విధులు నిర్వహించిన పలితమే రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని మీరే చెప్పినారు. ప్రజలకు పాలకులకు వారధిలా అను సంధాన కర్తలుగా మీరెంచుకున్న పాలనా వికేంద్రీకరణకు తోడునందిస్తూ పునర్నిర్మానంలో కంకణ బద్ధులైన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టి అటు నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలి. వికేంద్రీకరణలో భాగంగా జిల్లా విస్తరణలో అధిక పనిభారంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒత్తిడిలో పాలకుల విధానాలను ముందుకు  తీసుకు వెల్లుతున్నరనేది మీకు తెలియనిది కాదు. దీర్ఘకాలంగా అపరిష్క•త సమస్యలు వెంటనే పరిష్కరించాల్సి ఉంది. పి.ఆర్‌.‌సి. అమలు 61 ఏండ్ల పెంపు, హెల్త్ ‌కార్డులు, పదోన్నతులు, బదిలీలు, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను, ఉపాధ్యాయులను సంతృప్తి పరచాల్సి ఉందని గమనించండి. ఇక్కడ పాలకులు అధికారం అనే ముసుగు తొలిగించుకొని ప్రభుత్వ ఉద్యోగులు, ఆ శాఖవారు ప్రజల హక్కులను తెలియజేస్తూ, మేము చేయకపోతే నిలదీయండని ర్యాలీలు తీయడం చూశారా ! పౌరులు ప్రజాస్వామ్యయుతంగా అడగండని చైతన్యవంతమైన ఆలోచనలు ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్నారు. అందుకే పాలకులు వారి నోరుమూయించాలని చూడడం ఈ సమాజానికి శ్రేయస్కరం కాదు. సమాజ నిర్మాతలు ప్రజలకు పాలకులకు వారధులైన, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి చిత్తశుద్ధిని చాటాలి.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కనీస సౌకర్యాలు నేడు స్వరాష్ట్రంలో కోల్పోయినవి డి.ఎ., ఐ.ఆర్‌.‌లు లేవు. పి.ఆర్‌.‌సి. రాలేదు. సి.పి.ఎస్‌. ‌రద్ధు కాలేదు. హెల్త్ ‌కార్డులు పనిచేయడం లేదు. సర్వీసు రూల్స్ ‌లేవు, ప్రమోషన్లు రాలేదు, బదిలీలు జరగడం లేదు. నియామకాలు లేవు. 398/- వేతన ఇంక్రిమెంట్లు లేవు. డి.ఇ.ఓ./డివై ఇ.ఓ, ఎమ్‌.ఇ.ఓ., ‌హెచ్‌.ఎమ్‌., ఎస్‌.ఎ., ఎస్‌.‌జి.టి. ఖాళీలు నింపలేదు. పాఠశాలల్లో మౌళిక వసతులు లేవు. స్కావెంజర్లు, స్వీపర్లు లేరు.

తరగతులకు సరిపడ రూములు, ప్రయోగశాలలు, డిజిటల్‌ ‌తరగతులు లేవు. రియాంబర్స్ ‌మెంట్‌, ‌రిటైర్‌మెంట్‌ ‌బెనిఫిట్స్ ‌సకాలంలో రావు. సరెండర్‌ ‌బిల్స్, ‌జిపిఎఫ్‌, ‌పార్ట్ ‌ఫైనల్‌ ‌సకాలంలో రావు. జిపిఎఫ్‌, ‌టిఎస్‌జిఎల్‌ఐ, ‌సిపిఎస్‌ ‌డిడక్షన్‌ ‌ఖాతాలో ఎంట్రీ కావు, పాఠశాలల కరెంటు బిల్లుకు మోక్షం లేదు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర నిర్వహించి ఎన్నో కీర్తి కిరీటాలకు, పేరు ప్రతిష్ఠలకు కారకులైన ఉద్యోగుల అపరిష్క•త సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. సమాజ నిర్మాతలు రేపటి తరం ఆకాంక్షలు ఆశయాలకు ప్రతిరూపాలైన ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలుగరాదు. నేటి నిరుద్యోగ యువత శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగాల భర్తీకి పూనుకోవాలి. ఈ వర్గాలు నాడు మీతో స్వరాష్ట్ర ఉద్యమంలో ముందు నడిచిన అంశం విస్మరించరాదు. కనీసం మీరిచ్చిన హామీలనైనా నెరవేర్చండి..

ఉద్యోగులకు మీర్చిన హామీలు : పి.ఆర్‌.‌సి. అమలు, సి.పి.ఎస్‌. ‌రద్ధు, పదోన్నతులు, పదవీ విరమణ వయస్సు 61 సం।।ల వరకు పెంపు, హెల్త్ ‌కార్డులు, అన్ని యాజమాన్యాల్లో కాంట్రాక్టు, ప్రైవేట్‌ ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజ్‌ ‌చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం.
నిరుద్యోగులకు : సుమారు ఖాళీగా ఉన్న ఒక యాబదివేల ఉద్యోగాల భర్తీ, పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు సృష్టించడం,  నిరుద్యోగ భృతి, నైపుణ్య శిక్షణలు.
మేకిరి దామోదర్‌, ‌వరంగల్‌ ‌సెల్‌: 9573666650

Leave a Reply