Take a fresh look at your lifestyle.

‌గ్రామీణ స్థితిగతులపై ఆధునిక టెక్నాలజీ ప్రభావం

‘‘దేశ సమగ్రాభివృద్ధికి పట్టు కొమ్మలుగా ఉన్న గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అధునాతన పోకడలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ అవుతూ ఆధునిక ప్రపంచంలో సమూలమైన మార్పులు వస్తున్నప్పటికి , వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్యపరమైన నిత్యావసర సరుకులు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎంతోకొంత అతలాకుతలం చేస్తున్న పరిస్థితులు  గోచరిస్తుండటం శోచనీయం .సూపర్‌ ‌మార్కెట్ల పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన వాటిని కొనుగోలు చేసి తిరిగి వాటిని వ్యాపార రంగాల్లో అధిక ధరలకు  అమ్మకాలు జరిపి పెట్టుబడిదారులు ఆర్థిక పరిస్థితులను రుగుపరుచుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలోని.ఉత్పత్తిదారులు ఆర్థిక పరిస్థితులు చెప్పుకోలేనంత స్థాయిలో లేకపోవడం గమనార్హం. గ్రామీణ జీవనశైలిలో ఆధునిక టెక్నాలజీ ప్రముఖమైనదైనా కానీ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలలో పెను మార్పులు చోటు చేసుకోకుండా ఆధునిక టెక్నాలజీతో అనుసంధానంగా గ్రామీణ జీవనశైలి ముందుకు సాగితే  ఆధునిక టెక్నాలజీతో గ్రామీణ సామాజిక ఆర్థిక  వ్యవస్థ సాంస్కృతిక సాంప్రదాయలతో సుస్థిరమైనదిగా ఉండగలదేమో…. ’’

నేటి అధునాతన ప్రపంచంలో గ్రామీణ ఆర్థిక వాణిజ్య వ్యాపార వ్యవస్థ క్రమక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నంలో గ్రామీణ ప్రాంతాల్లో జీవన సంస్కృతి సాంప్రదాయాలలో ఎంతో  కొంత మార్పులు  కనిపిస్తున్నాయి.  కలసికట్టుగా ఒకే జట్టుగా కులమత భేదాలకు అతీతంగా ఉన్న గ్రామీణ జీవనం సాంకేతికకు దగ్గరగా తీరిక లేనంతగా ఆధునిక వ్యవస్థలకు అతుక్కుపోతున్నారు. ఆత్మీయత మానవ సంబంధాలు కుదించుకు పోతున్న తీరు గ్రామీణ జీవన విధానంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి.

 కనుమరుగైపోతున్న చేతివృత్తులు కుటీర పరిశ్రమలు
వ్యవసాయ రంగంలోకి టెక్నాలజీ ప్రవేశించి పొలం పనుల్లో సైతం వ్యవసాయ కూలీలు ఉపాధి తగ్గిపోయాయి ,ఒకప్పుడు చేతినిండా పని దొరికే గ్రామీణ వ్యవస్థలు చేతివృత్తులు చతికిల పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌ ‌టవర్లు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సెల్‌ ‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి .గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన వాణిజ్య పంటలు  నిత్యావసరసరుకుల  పత్తి, జొన్న, మొక్కజొన్న,  వరి, పప్పు దినుసులు,  పాల ఉత్పత్తులు,  మొదలైనవి వ్యాపార చేతుల్లోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయినటువంటి వాటిని తక్కువ ధరలకే కొనుగోలు చేసుకుని వాటిని పారిశ్రామికంగా వివిధ రూపాల్లో తయారుచేసి ఆకర్షించే రీతిలో పొందుపరిచి సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని సూపర్‌ ‌మార్కెట్ల పేరుతో సంస్థలు అమ్మకాలు జరుపుతున్నయు.

ఇలాంటి వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లోకి కొత్త రూపాలలో తీసుకువచ్చి వాణిజ్య వ్యాపార సంస్థలు కోట్లు గడిస్తున్నాయి.గ్రామీణ వ్యవస్థల్లో సాంప్రదాయ ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నట్లు గోచరిస్తున్నాయి, గ్రామీణ ప్రాంతంలోని నుండి ఉత్పత్తి అయిన సరుకులు పట్టణాలకు చేరుతున్న నిత్యావసర వస్తువులు వాణిజ్య పంటలు తిరిగి అధిక ధరలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి ఆధునికత పేరుతో అన్ని రంగాల్లో ఎక్కువగా నష్టపోతున్నది కష్టపడి పని చేసే గ్రామీణ జీవన విధానమే అని అనిపిస్తున్నది.

గ్రామీణ ప్రాంతాలకు చొచ్చుకొచ్చిన ఆన్‌లైన్‌ ‌వస్తు సేవలు…
ఇదే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్డర్‌ ‌పై ఆహారత్పత్తులను సేకరించే పద్ధతిని టెక్నాలజీని ఉపయోగించుకుని నేర్చుకుంటున్నారు. గ్రామం నుండి ఉత్పత్తి అయ్యే వస్తువులనే అధిక ధరల్లో ప్యాకింగ్‌ ‌రూపంలో తెచ్చుకుంటున్నారు. .గ్రామీణ ప్రాంతాల్లో విందులు వినోదాల్లో కూడా రెడీమేడ్‌ ‌గా తయారైన ఉత్పత్తులను ఆర్డర్‌ ‌పై తెప్పించుకోవడం సర్వసాధారణమై పోయింది.
గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు కూడా మూతబడిపోయినాయి, రెడీమేడ్‌ ‌దుస్తులు తయారీ గ్రామీణ ప్రాంతాలకు చొచ్చొకొని  వచ్చాయు చేతివృత్తులు చేసేవారు దాదాపు కనుమరుగైపోతున్నారు. రెడీమేడ్‌ ‌వస్తువులు ప్లాస్టిక్‌ ‌తదితరమైన వాటితో తో తయారు చేసినటువంటి గృహ అవసవర సామాగ్రి వచ్చింది ఏ కులవృత్తిని తీసుకున్న ఆ కులవృత్తి ఉత్పత్తులు రెడీమేడ్‌గా మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి. రెడీమేడ్‌ ఇం‌టి నిర్మాణ సామాగ్రి రెడీమేడ్‌ ‌కుర్చీలు ఆభరణాలు బట్టలు ఆహార పదార్థాలు ఇలా ఎన్నో రకాలైన వస్తువులు కృత్రిమత్వాన్ని సంతరించుకొని గ్రామీణ జీవన విధానంలోకి వస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే ఏ వస్తువునైనా తిరిగి కొత్త రూపంలో  హంగులతో మార్కెట్లోకి అధిక ధరలకు తీసుకొచ్చి పట్టణ సంస్కృతిని పల్లె ప్రాంతం వరకు విస్తరించిన కొన్ని సంస్థలు ఆన్లైన్‌ ‌విధానాలతో ఆఫర్లతో ఆకర్షింప చేసుకొని గ్రామీణసమాజానికి అలవాటుగా మారుస్తున్నాయి. కొంతమంది పెట్టుబడిదారులు ఇలాంటి వ్యాపార సంస్థల్లో భాగస్వాములై ఉత్పత్తి సంపాదనంతా వాళ్ల చేతిలోనే ఉంచుకుంటున్నారు అనేది ఒక వాదన ఏదేమైనప్పటికీ ఆధునిక నాగరికత ప్రపంచంలో టెక్నాలజీ గ్రామీణ ప్రాంతంలోని రూపురేఖలను సంస్కృతి సాంప్రదాయాలను మార్చే రీతిలో గ్రామీణ ప్రాంత జీవన విధానం ఆకర్షణలకు లోనవడం ఆర్థికంగా నష్టాలను సరిచూవడం పట్టణ ప్రాంతాలకు ఇదే వస్తువులు భారీ లాభాలతో తరలి వెళ్లడం తిరిగి పట్టణ వాసులకు ఎక్కువైనటువంటి అవసరాలు గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యాప్తి చేయడం ఉత్పత్తి చేసే రైతుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అధిక వ్యత్యాసంలో ఆర్థిక పరిస్థితి…
సాంకేతిక మార్పు గ్రామీణ ప్రాంతాలలో వృద్ధిరేటు అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయు మరియు పట్టణ-గ్రామీణ ఆదాయ అసమానతను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాలు  ఆర్థిక వ్యవస్థలు పునరావృతమయ్యే పనులలో అధిక వాటాను కలిగి ఉండటం  వైవిధ్యం లేకపోవడం మరియు  విభిన్న రంగాల్లో అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల ఇతర ప్రాంతాలకు వలసల వెల్లిపోతుండటం సాపేక్షంగా అధిక ప్రమాదాన్ని గ్రామీణ ప్రాంతాలు  తరుచుగా ఎదుర్కొంటున్నాయి.

ఉత్పత్తి ప్రాంతాల్లో తక్కువ ధరతో కొనుగోలు మార్కెట్లో ఎక్కువ రేట్లతో చలామణి….
గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన నిత్యావసర సరుకులు  వాణిజ్య పంటలు పత్తి, జొన్న, మొక్కజొన్న,  వరి, పప్పు దినుసులు,  పాల ఉత్పత్తులు లాంటి వ్యవసాయ ఉత్పత్తులు పారిశ్రామిక నగర పట్టణ పారిశ్రామికీకరణ అనంతరము పెట్టుబడిదారులు వ్యాపారస్తులు రైతులు పండించే పంటల వద్దకు నేరుగా వెళ్లి సరసమైన ధరలకు కొనుక్కొని తిరిగి వాటిని మార్కెట్లో వివిధ రూపాల్లో మిషన్ల ద్వారా ప్యాకేజీ చేసి.దుకాణాలలో రైతుల వద్ద కొన్ని రేటు కంటే అధిక స్థాయిలో ధరలు నిర్ణయిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే రైతుల వద్ద నుండి పంటలను పూర్తిగా కొనుక్కొని వెళ్ళిన తర్వాత పరిశ్రమలలో కావలసిన రీతిలో తయారు చేసి తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలుగా ఉంచుతున్నారు అంటే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మిన రైతులు అదే వస్తువులను మార్కెట్లలో  ఎక్కువ రేట్లకు అవసరాల నిమిత్తం కొనుక్కోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు మంచి లాభాన్ని చేకూరుస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎగుమతులు చేసే పరిస్థితి ఉంది గాని నిలువ ఉంచుకునే పరిస్థితులు లేకుండా  దలారీలు వాణిజ్య సంస్థలు రైతుల దగ్గర కొన వస్తువులను తిరిగి అనేక రూపాల్లో మళ్లీ విక్రయించడం ఆధునిక నాగరికత పోకడలకు వ్యవసాయ ఉత్పత్తులకు ఆర్థికంగా నష్టమే జరుగుతున్నది. దలారీలు లాభాల బాటన పడుతున్నారు. ఒకప్పటి గ్రామీణ జీవన విధానంలో సరిపడా వ్యవసాయ ఆధారిత  నిలువలు అందరి దగ్గర ఉండేవి కానీ ఇప్పుడు అవి దలారుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. డబ్బు ప్రధానంగా భావించే కొంతమంది తక్కువ ధరల్లో పంటలను కొని తిరిగి వాటిని మార్కెట్లోకి ఉత్పత్తి చేయడం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న ఆధునిక ధోరణి పరోక్షంగా వ్యవసాయ ఉత్పత్తులు చేసే గ్రామీణ ప్రాంతంలోని రైతాంగాన్ని ప్రభావితం చేస్తునే ఉంటుంది…
దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా, 9492097974

Leave a Reply