Take a fresh look at your lifestyle.

సోనియా ఆరోగ్యంపై దిల్లీ కాలుష్యం ప్రభావం

వైద్యుల సలహా మేరకు ఢిల్లీని వీడనున్న కాంగ్రెస్‌ అధినేత్రి..!

కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం దష్ట్యా కొన్ని రోజులు దేశ రాజధానికి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఆమెకు దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా వైద్యులు ఈ సలహా ఇచ్చారు. కొన్ని రోజుల పాటు సోనియా గోవా లేదా చెన్నై వెళ్లవచ్చని డియా కథనాలు చెబుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఆమె బయటకు వెళ్లే అవకాశం ఉందని, రాహుల్‌ ‌గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆమెతో కలిసి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆగస్టులో హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయిన కారణంగా చికిత్స పొందుతున్న సోనియా గాంధీ ఛాతీలో ఇన్ఫెక్షన్‌ ‌సోకడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీ వాయు కాలుష్యం ఆమె ఆస్తమాను మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లమని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. పార్టీకి అవసరమైన సమయంలో సోనియా ఢిల్లీ నుంచి బయటకు వెళ్తున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పలువురు పార్టీ నాయకులు ప్రశ్నలు లేవనెత్తి ఆత్మపరిశీలన చేయాలని డిమాండ్‌ ‌చేశారు. అంతకుముందు పార్టీలో సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ పలువురు నేతలు ఆమెకు లేఖ రాశారు. సోనియా గాంధీ జూలై 30 సాయంత్రం ఢిల్లీలోని సర్‌ ‌గంగా రామ్‌ ‌హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 12‌న ఆమె రెగ్యులర్‌ ‌చెకప్‌ ‌కోసం కొన్ని రోజులు విదేశాలకు వెళ్లగా రాహుల్‌ ‌గాంధీ కూడా ఆమెతో ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply