Take a fresh look at your lifestyle.

తెలంగాణ సరిహద్దుల్లో.. ఆర్కె అంత్యక్రియలు పూర్తి ఫోటోలు విడుదల

మావోయిస్ట్ ‌పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ‌సాకేత్‌ అలియాస్‌ ‌రామకృష్ణ అలియాస్‌ ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తెలంగాణలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలను నిర్వహించారు.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్కే అంత్యక్రియలను పూర్తి చేశారు. ఆర్కే అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరయ్యారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యారు. వారంత విప్లవ నేతకు నివాళి అర్పించారు.

Leave a Reply