ప్రజాతంత్ర, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతోందని బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. మెజారిటీ లేని స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్ దొడ్డి దారిన చైర్మన్ పదవులను చేజిక్కించుకోవాలని చూస్తోందన్నారు. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కేకే తెలంగాణలో ఎక్స్ అఫీషియో మెంబెర్‌గా ఎలా చెల్లుబాటవుతారని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ నేత లక్ష్మణ్ వెల్లడించారు. త్వరలో పవన్ కల్యాణ్‌తో సమావేశమవుతామని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపడం లేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags: immoral actions, ruling party, State BJP president, fired, KCR, Laxman