సమ్మయ్య నగర్ డ్రైనేజి నిర్మాణానికి రూ.10కోట్లు
బాధితులను ఆదుకుంటాం
వరంగల్‌లో మంత్రి కెటిఆర్ సుడిగాలి పర్యటన
నాలాలు, చెరువులను ఆక్రమించుకుని కట్టడాలు చేపట్టడం వల్లనే వరంగల్ నగరం నీటమునిగిందని మంత్రి కెటిఆర్ సహా పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. కబ్జాలను తొలగిస్తే తప్ప వరంగల్‌కు ముక్తి లేదని కెటిఆర్ అన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్టస్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మంగళవారం ఉదయం వరంగల్‌కు చేరుకున్న
మంత్రి కెటిఆర్ మొదట హన్మకొండలోని నయింనగర్ నాలాలను పరిశీలించారు. అక్కడి నుండి సమ్మయ్య నగర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు ధైర్యాన్ని కల్పించారు. శాశ్వత పరిష్కారం చేస్తామని, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు, గృహాల్లో నీళ్ళు నిలిచిన కుటుంబాలకు మునిసిపాలిటీ నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమాలకు గురైన నాలాలను తొలగిస్తామని, అందుకు అక్కడి ప్రజలు సహకరించాలని కెటిఆర్ కోరారు. అక్కడి టూరిజం శాఖ బస్సు నుండే ఇదులవాగు పరిశీలించారు. అక్కడ వరద ప్రవాహన్ని మంత్రి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు ఆయనకు వివరించారు. 100ఫీట్ల రోడ్డు పెద్దమ్మ గడ్డ, ఆర్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద భద్రకాళి వాగు బ్రిడ్జి పరిశీలనలో అక్రమ నిర్మాణాలతో పాటు చెట్లను కూడ తొలగించాలని, ఇలాంటివి యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రిన్సిపాల్ సెక్రెటరీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో పర్యటించిన అనంతరం మొత్తం ముళ్ళ పొదలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మునిసిపాలిటీ శాఖ డైరెక్టర్‌కు మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. పోతననగర్ భద్రకాళి వరదను పరిశీలిస్తూ సంతోషి మాతా గుడి వద్ద నీట మునిగిన ప్రాంతాన్ని, బొంది వాగును పరిశీలించిన మంత్రి మున్సిపల్ కమిషనర్ నుండి ఎంత వరద వస్తుందో దానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. వంద శాతం పర్మినెంట్ పరిష్కారం చేస్తామని, భద్రకాళి బండ్‌కు స్లూస్ అదనంగా ఏర్పాటు చేస్తామని, కిలో మీటర్ దూరం రోడ్డు నడుచుకుంటూ ప్రజలతో మాట్లాడుతూ పరిశీలన చేశారు. భద్రకాళి •ండ్‌లో ఒకే స్లూస్ వలన నీరు నిలిచి పోయిందని, ఎక్కువ స్లూస్ ఏర్పాటు చేస్తే వరద నిలిచి పొదని మంత్రి ప్రజలు వివరించారు. భద్రకాళికి ఎక్కడ నుండి ఎంత వరద వస్తుందో నివేదిక ఇవ్వాలని కలెక్టర్, కమిషనర్లను ఆయన ఆదేశించారు. ట్యాంక్ కెపాసిటీ వివరాలు తెలుసుకున్న మంత్రి గతంలో 180 సెంటిమీటర్ల పడిన వర్షం ఆధారంగా •ండ్‌కు రెండు స్లూసులు ఏర్పాటు చేశామని, ఈ సారి 270 సెంటి మీటర్ల వర్షం పడిందని కమిషనర్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి, కార్పొరేషన్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎంజిఎంలో కోవిడ్ బాధితులను పరామర్శించిన మంత్రి
మంత్రి కెటిఆర్ తన పర్యటనలో భాగంగా ఎంజిఎం హాస్పిటల్లో కోవిడ్ వార్డును సందర్శించి కొరోనా బాధితులను పరామర్శించారు. వారికి వైరస్‌పై• అవగాహన కల్పిస్తూ బాధితులకు ధైర్యం చెప్పారు. అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన ఆక్సిజన్, వెంటిలే•టర్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్‌గా కెఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో ముందే నిర్ణయించిన మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుని కేటీఆర్ హైదరాబాద్‌కు వెళ్లారని ఎర్రబెల్లి దయాకరరావు..