Take a fresh look at your lifestyle.

నీమ్జ్  ‌కోసం 12,635 ఎకరాల అక్రమ భూసేకరణ

  • తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌
  • ‌కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్‌తో భేటి

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దని జహీరాబాద్‌ ‌భూ నిర్వాసితుల తరుపున కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కు టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌విజ్ఞప్తి చేశారు. కోదండరామ్‌తో పాటుగా భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప, రాఘవరెడ్డి కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్‌తో గురువారం సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం 12,635 ఎకరాల భూమిని సేకరిస్తుంన్నదని కేంద్ర మంత్రికి భూ నిర్వాసితుల తరుపున పిర్యాదు లేఖ ఇచ్చారు. 90 శాతం వ్యవసాయ భూమి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 శాతం భూమి మాత్రమే వ్యవసాయ భూమి అని తప్పుడు నివేదిక ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు.

జహీరాబాద్‌లో బలవంతపు భూ సేకరణను తక్షణమే ఆపాలి..
నీమ్జ్  ‌కోసం జహీరాబాద్‌లో 12,635 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్రం సేకరిస్తున్నదని, 22 గ్రామాల పరిధిలో భూ సేకరణ జరుగుతందని, రైతుల విలువైన భూమిని నామమాత్రపు ధరకు లాక్కునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేస్తున్నదని వారు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. తెలంగాణ సర్కార్‌ ‌దిల్లీకి తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు మంజూరు చేయించుకోవటానికి ప్రయత్నం చేస్తుందని, దీన్ని కేంద్రం అడ్డుకోవాలని కోరారు. పడావ్‌ ‌భూములని చెప్తున్నారని, కానీ అది నిజం కాదని, 90 శాతం సాగు భూములు ఉన్నాయని వారు వివరించారు. నియమాలను తోసిరాజని తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకోవాలని ప్రొఫెసర్‌ ‌కోదండరాం బృందం కోరగా కేంద్రమంత్రి భుపేంద్ర యాదవ్‌ ‌పరిశీలిస్తామని హామీ ఇచ్చారని భూ నిర్వాసితుల సంఘం తెలిపింది. తాము నేషనల్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్‌లో పిర్యాదు చేశామని, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని కూడా కలుస్తామని, అనుమతులు ఇవ్వొద్దని ఆయనకు కూడా అని వివరిస్తామని భూ నిర్వాసితుల సంఘం తెలిపింది. బలవంతపు భూ సేకరణను తక్షణమే ఆపాలని భూ నిర్వాసితుల సంఘం డిమాండ్‌ ‌చేసింది. అంబేద్కర్‌ ఆలోచనలకు విరుద్దంగా కెసీర్‌ ‌వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. రైతుల భూములను కాపాడటం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మీడియాకి తెలిపారు.

Leave a Reply