- వార్త రాస్తే బాగుండదు…సర్పంచ్ భర్త అంతటి రమేష్
- అనుమతి ఇవ్వలేదు…! అనుమతి ఇచ్చాం : ఐబీ ఎఈ చంద్రశేఖర్
- జేసిబి సాయంతో ట్రాక్టర్లకు ఎత్తుతున్న చెరువు మట్టి
అనేక పోషక జీవ పదార్థాలు ఉన్న చెరువులు కుంటల మట్టిని వ్యవసాయ సాగు భూముల్లో మాత్రమే వాడుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించరాదని వాల్టా చట్టం ఉన్నప్పటికీ అక్కడ అక్కడ వాల్టా చట్టానికి అధికారులు ప్రజాప్రతినిధులు బడా వ్యాపారులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. మండలంలోని బోగారం గ్రామంలో గ్రామ సర్పంచ్ భర్త అంతటి రమేష్ ఇటీవల కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిలోని బావిని గ్రామ చెరువు నుండి బుధవారం జెసిబి సహాయంతో పదుల సంఖ్యలో డాక్టర్లను పెట్టి వందలాది మట్టిని తీసుకెళ్లి బాబి నీ పూర్తి చేస్తున్నారు. అనుమతి లేకుండా పోషక పదార్థాలు కండ కలిగిన చెరువు మట్టిని బావిలో సర్పంచ్ భర్త పోస్తున్నారని గ్రామానికి చెందిన పలువురు స్థానిక విలేఖర్లకు సమాచారం ఇవ్వడంతో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన స్థానిక విలేకరులను రమేష్ దురుసుగా మాట్లాడటమే కాకుండా వార్త రాస్తే బాగుండదని బెదిరించాడు.
పల్లె ప్రగతి అంటూ సమర్థింపు..
బోగారం గ్రామ చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న విషయం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు వెళ్ళి పరిశీలిస్తుండగా, పల్లె ప్రగతి కార్యక్రమంలో పాడుపడిన బావులు పూడ్చుతున్నామని పేర్కొంటూ అనుమతి కోసం ఒక వ్యక్తి ద్వారా దరఖాస్తును స్థానిక తాసిల్దార్ వద్దకు పంపగా, ఇది మా పరిధిలోని కాదని ఎంపీడీవోకు చెందుతుందని తెలుపడంతో, ఎంపిడిఓ జలెందర్ రెడ్డికి బోగారం సర్పంచ్ భర్త అంతటి రమేశ్ బుధవారం మధ్యాహ్నం చరవాని ద్వారా తన స్వంత బావి పూడ్చడానికి అనుమతి కోరరాని ఎంపిడిఓ జలెందర్ రెడ్డి తెలిపారు.
విలేకరి ముసుగులో ఉన్న వ్యక్తితో ఎదురుదాడి:
విలేకరి అని చెప్పుకునే ఒక వ్యక్తితో అంతటి రమేష్ స్థానిక మీడియా ప్రతినిధులపై ఎదురుదాడికి పురికొల్పి నట్లు తెలుస్తోంది. స్థానిక విలేఖర్లు క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాడుపడిన, ప్రమాదకరంగా ఉన్న బావులు, గుంతలు పుడుస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేర్లను వాడుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేశారు.
అనుమతి ఇవ్వలేదు: ఐబి ఏఈ చంద్రశేఖర్
చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచా రం నీటిపారుదల శాఖ ఐబిన ఎఈ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరగా ఉదయం గోకారం గ్రామం వద్ద ధర్మారెడ్డిపల్లి కాలువ పరిశీలనలో ఉన్న చంద్రశేఖర్ ఏ చెరువు నుండి మట్టి తరలింపుకు అనుమతి ఇవ్వలేదని మట్టి తరలిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం అక్ర మంగా మట్టిని తరలిస్తున్న చెరువు వద్ద పరిశీలన చేసి డిఈ అనుమతి ఇచ్చారని, పల్లె ప్రగతిలో భాగం గా బావిని పుడుస్తున్నారని మాట మార్చి చెప్పడం కొసమెరుపు.