Take a fresh look at your lifestyle.

మంత్రుల ఇలాఖాల్లో ఇక పర్యటిస్తా

  • దళితబంధు ఎందుకు రాలేదో నిలదీస్తా
  • కెసిఆర్‌ ‌బొమ్మతోనే గెలుస్తామన్న వారికి చెంపపెట్ల్టు
  • గతంకన్నా ఎక్కువ వోట్లు సంపాదించుకున్నా
  • కేంద్రమంత్రి అమిత్‌ ‌షాకు కృతజ్ఞతలు
  • మిడియా సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
  • ‌టిఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు..ఇక కెసిఆర్‌ అవినీతిపై పోరాడుతాం : బండి సంజయ్‌

ప్రజాతంత్ర, హుజూరాబాద్‌: ‌హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని, వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ తనను గెలిపించిన హుజురాబాద్‌ ‌ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్‌ ‌ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళితబంధు ఆయా ప్రాంతాల నేతల నియోజకవర్గాల్లో దగ్గర ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు. తనకు అండగా ఉన్న కేంద్రమంత్రి అమిత్‌షాకు ఈటల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని, డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. హుజురాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా.. ప్రజలు తనవైపే నిలబడ్డారని, కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఇది కేసీఆర్‌ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన గెలుపుగా అభివర్ణించారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారు. హుజూరాబాద్‌ ‌ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారు. చివరకు హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారు. ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు. కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు..అయినా ఎవరూ లొంగలేదు.

మేము దళిత బస్తీలకు పోయినపుడు దళిత బంధుకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారు. మేం పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారు. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు నా వైపే నిలబడ్డారు. ఈ విజయం హుజూరాబాద్‌  ‌ప్రజలకు అంకితంగా ఇస్తున్నానని అన్నారు. ‘హుజూరాబాద్‌ ‌ప్రజల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా నేను వారి రుణం తీర్చుకోలేను. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా. నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?. కేసీఆర్‌ ‌మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ  వోట్లు వొచ్చాయి. నేను పార్టీలు మారినవాడిని కాదు. నా చరిత్ర తెరిచిన పుస్తకం. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు, నా గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు. నాకు అండగా ఉన్న అమిత్‌ ‌షాకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని ఈటల రాజేందర్‌ అన్నారు. హుజురాబాద్‌ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నీచపు, చిల్లర పనులు చేశారని ఈటల విమర్శించారు. ఆయన బొమ్మ, ఆయన గుర్తు దనే గెలుస్తారన్న అహంకారం ఉందని, టీఆర్‌ఎస్‌కే వోట్లు వేయాలని పసుపు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారన్నారు. దళితబంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారని, డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు. దమ్ముంటే మామా అల్లుడు పోటీ చేయాలని సవాల్‌ ‌విసిరిన తెలంగాణలో దీపావళి నిన్ననే జరిగిందని ఈటల వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆయన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

టిఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు..ఇక కెసిఆర్‌ అవినీతిపై పోరాడుతాం : బండి సంజయ్‌
‌టీఆర్‌ఎస్‌కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని బీజేపీ నేత బండి సంజయ్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ప్రలోభాలకు గురిచేసి, బెదరించి, డబ్బులు పంచినా ప్రజలు లొంగలేదన్నారు. కెసిఆర్‌ ‌వైఖరి ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందన్నారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ‌హుజురాబాద్‌లో అడ్డదారిలో గెలవాలని చూసిందని, డబ్బులు పంచి హుజురాబాద్‌ ‌ప్రజలను అవమానించారన్నారు. గెలవాలని అబద్దాలు ప్రచారం చేశారని బండి సంజయ్‌ ‌దుయ్యబట్టారు. మరోవైపు ఊహించినట్లుగానే హుజూరాబాద్‌లో విజయం వరించడం కమలం పార్టీలో జోష్‌ ‌నింపింది. ఇక కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌ అవినీతిపై పోరాడుతామని అన్నారు. వొచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం ఒకవైపు పావులు కదుపుతుండగా, మరోవైపు రాష్ట్ర పార్టీ నాయకత్వం అధికార టీఆర్‌ఎస్‌పై పోరాటాలు చేస్తుంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందంటూ ఆందోళనలను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో.. హుజూరాబాద్‌ ‌విజయం కొత్త శక్తినిచ్చిందని కమలనాథులు సంబురపడుతున్నారు. హుజూరాబాద్‌ ‌ప్రజలు నీతి, నిజాయితీకి పట్టం కట్టారని, నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యమని నిరూపించారని బండి  అన్నారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో హుజూరాబాద్‌ ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. అభ్యర్థి ద ప్రజలకు విశ్వాసం ఉంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పనిచేయదని రుజువైందన్నారు. ఈ విజయం హుజూరాబాద్‌ ‌ప్రజల విజయమని ఆయన తెలిపారు. ఈ ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్ని రకాల పథకాలతో మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు ధర్మానికి కట్టుబడి ఉన్నారని అన్నారు.

Leave a Reply