Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సంక్షేమానికి ఐజెయూ పోరాటం అభినందనీయం


యూనియన్‌ ‌కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన మంత్రి 

దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ అవిశ్రాంతంగా పోరాటాలుకొనసాగించడం అభినందనీయమని ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బిజేశ్‌పథక్‌ ‌కొనియాడారు. రెండు రోజుల పాటు లక్నోలో జరుగుతున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ఎంతో శ్రమించి ఒక చోట నుంచి మరోచోటకు సమాచారాన్ని అందజేస్తారని, సమాజంలో సమాచార వారధిగా పనిచేస్తున్నారని అన్నారు మేధస్సుతో పనిచేసే అన్నిచోట్ల సమస్యలు తప్పవని, వాటి పరిష్కారం కోసం సంఘం ద్వారా పోరాడటం సహజమేనని ఆయన పేర్కొన్నారు. ఐజేయూ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కృషి కొనసాగించాలని మంత్రి కోరారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. వర్కింగ్‌ ‌జర్నలిస్టు చట్టాన్ని రద్దుచేసి లేబర్‌ ‌కోడ్‌లోకి పాత్రికేయులను చేర్చిన సమస్యపై యూనియన్‌ ‌లిఖితపూర్వకంగా ఇస్తే సంబంధిత అధికారులతో చర్చిస్తానని హా ఇచ్చారు. ఈ సమావేశానికి ఐజేయూ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో సెక్రటరీ జనరల్‌ ‌బల్విందర్‌సింగ్‌జమ్మూ, మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్‌,ఎస్‌ఎన్‌ ‌సిన్హా, యూపీ యూనియన్‌ ‌ప్రధాన కార్యదర్శి రమేశ్‌శంకర్‌పాండే తదితరులు మాట్లాడారు.

Leave a Reply