Take a fresh look at your lifestyle.

రెండు రోజులపాటు ఐజెయూ జాతీయ కార్యవర్గ సమావేశం

వివరాలు ప్రకటించిన అధ్యక్షులు కె శ్రీనివాస్‌ ‌రెడ్డి
రేపటి నుండి హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో జరుగనున్నది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సుధీర్ఘ కాలం తర్వాత భౌతికంగా అక్టోబర్‌, 23 ‌మరియు 24 తేదీలలో ఈ సమావేశం జరుగనున్నది.

ఈ సమావేశంలో అసోమ్‌ ‌మరియు లడఖ్‌తో సహా దాదాపు అన్ని రాష్ట్రాలు మరియు యూనియన్లు పాల్గొంటాయని యూనియన్‌ అధ్యక్షులు కె శ్రీనివాస్‌ ‌రెడి ఒక ప్రకటనలో వెల్లడించారు. రెండు రోజుల ఎన్‌ఇసి సమావేశం జర్నలిజం వృత్తి, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులు మరియు మీడియా సంస్థల మీద పెరుగుతున్న, జర్నలిస్టుల భద్రతకు సంబంధించిన సమస్యలపై చర్చించనుంది.

రెండు రోజుల సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్‌, ‌పర్యాటక మరియు క్రీడల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్‌ ‌ప్రసంగించనున్నారు. రేపు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సమావేశం ప్రారంభం కానున్న సమావేశాన్ని హైదరాబాద్‌ ‌తెలంగాణ స్టేట్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్టస్(‌టియూడబ్ల్యుజె) నిర్వహిస్తుంది.

Leave a Reply