Take a fresh look at your lifestyle.

బెంగళూరు పోలీసుల చర్యకు ఐజేయూ ఖండన

కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప కుమారుని, ,ఇతర బంధువుల అవినీతిపై పరిశోధన కథనాలను ప్రసారం చేసినందుకు బెంగళు పోలీసులు పవర్ టీవీ కన్నడ టీవి ఛానల్ ప్రసారాలను నిలిపి వేయడాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ తీవ్రంగా ఖండించింది. బెంగళూరుకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్యూరో (సీసీబీ ) అధికారులు పవర్ టీవీ ఛానల్స కార్యాలయంపై సోమవారం దాడి చేసి ఆఫీసులో ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారనీ, ప్రసారాలను నిలిపివేయించారని యూనియన్ అధ్యక్షుడు కె. శ్రీనివాస రెడ్డి, ప్రదాన కార్యర్సి బల్వీందర్ సింగ్ జమ్ము ఆరోపించారు.

ఆ ఛానల్ కార్యాలయంపై పోలీసుల దాడి పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా వారు ఒక ప్రకటనలో అభివర్ణించారు. ఆ ఛానల్ సర్వర్ లను తిరిగి పునరుద్ధరించాలనీ, ప్రసారాలు పునః ప్రారంభమయ్యేందుకు దోహదం చేయాలని వారు డిమాండ్ చేశారు. భావవ్యక్తీకరణ, మీడియా స్వేచ్చ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులని వారు గుర్తు చేశారు, పవర్ టీవి సంస్థ నిర్వాహకులకూ, సంపాదకవర్గానికీ ,జర్నలిస్టులకూ ఐజేయూ పూర్తి సంఘీభావాన్నీ, మద్దతును ప్రకటించింది. పోలీసుల దురుసుతనంపై పోరాడేందుకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply