Take a fresh look at your lifestyle.

కార్మికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

  • సొంతం గ్రామాలకు పంపాలని రోడ్డు పైకి వచ్చిన ఐఐటి కార్మికులు
  • పోలీసులపై తిరగబడ్డ ఐఐటి కార్మికులు
  • ఎమ్మెల్యే , ఎస్పీ , ఆర్డిఓల చొరవతో వెనక్కి తగ్గిన కార్మికులు

ఐఐటి-హెచ్‌ ‌క్యాంపస్‌లో నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఎల్‌అం‌డ్‌ ‌టి కంపెనీకి చెందిన హెచ్‌ఆర్‌ ‌సిబ్బందిపై, పోలీసులపై వలస కార్మికులు దాడి చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటి హైదరాబాద్‌ ‌లో పనిచేస్తున్న జార?ండ్‌ ‌కు చెందిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో నెల పది రోజులుగా ఇక్కడే ఉండి పోయారు. వారికి సంబంధించిన వేతనాలు కాంట్రాక్టర్‌ ఇవ్వటం లేదని, డబ్బులను తమకుటుంబీకులకు పంపక పోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఐఐటి ప్రాంగణంలో దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి రూరల్‌ ‌పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని వలస కూలీలను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారిపై పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడి లో ముగ్గురు పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

తమకు జీతాలు ఇచ్చి స్వస్థలాలకు తిరిగి పంపించాలని కార్మికులు డిమాండ్‌ ‌చేశారు. ఘటనా స్థలానికి ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌ ‌రెడ్డి, ఆర్డీవో మెంచు నగేష్‌ ‌తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. కార్మికులతో మాట్లాడిన ఆయన కార్మికులకు కావాలసిన అన్ని అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను సముదాయించారు.

ఇబ్బందులు కలుగకుండాచూస్తాం:కలెక్టర్‌ ‌హన్మంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి
ఐఐటిలో జరిగిన ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్పందించి వలస కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండాచూస్తమాని హామీనిచ్చారు. ఆహారం అందించడంతో పాటు వారికి పనులు చేసుకునే వెసులు బాటును కల్పిస్తామన్నారు.

Leave a Reply