మణుగూరు: సింగరేణి ఓబి కార్మికు లందరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిం చాలని, ఓబి డైవర్లను ఆపరేటర్లుగా గుర్తించి తగిన వేతనాలు చెల్లిం చాలని ఇప్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని •డిమాండ్ చేశారు. గురువారం విపిఆర్.ఓబి కార్మికుల సమా• •శంలో ఆయన పాల్గొని మాట్లాడు తూ… ఉమ్మడి రాష్ట్రంలో సీమాంద్ర పాలనలో కాంట్రాక్ట్ కార్మికులు బానిస చాకిరి చేస్తూ శ్రమదోపిడికి గురవతున్నారని, తెలంగాణ ప్రాంతాన్ని ఓపెన్‌కాస్టులు బొందలగడ్డగా మారుస్తున్నారని, విద్వంసానికి గురి చేస్తున్నారని చెప్పిన కేసీఆర్.
మేము అధికారంలోకి వస్తే ఓపెన్ కాస్టుల వుండవని, భూగర్భ గనులు తవ్వించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్ కార్మికులం దర్ని పర్మినేంట్ చేస్తామని హామి వల్ల తెలంగాణ ఉద్యమంలో చూరుకైన పాత్ర పోషించారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామి అమలు కాలేదని విమర్శించారు. ఓబి కార్మికులకు చట్టబద్దమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న నిర్వహించే ఛలో అసెంబ్లి కార్యక్రమంలో ఓబి కార్మిలందరు పాల్గొని విజయ వంతంచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.సాంబిరెడ్డి, పాల్గొన్నారు.