Take a fresh look at your lifestyle.

పొరపాటున బిజెపికి వోటేస్తే.. బాయిలకాడ మీటర్లకు ఒప్పుకున్నట్టే

  • పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌చేసిందేమీ లేదు
  • దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌

‌దుబ్బాక ఉప ఎన్నికల్లో పొరపాటున ఎవరైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వోటేస్తే బాయిలకాడ కరంటు మీటర్ల ఏర్పాటుకు ప్రజలు అంగీకరిస్తున్నారనీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాట్లాడే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. పోలింగ్‌ ‌టైంలో కనిపించకనో, చెయ్యి వణికో అటో ఇటో పోయి బిజెపి గుర్తు మీద ఒక్కరో, ఇద్దరో వోట్లేస్తే బాయిలకాడ మీటర్లకు ఒప్పుకున్నట్టే అవుతుందనీ, వోటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆచితూచి కారు గుర్తుకు వోటెయ్యాలన్నారు. శుక్రవారం దుబ్బాక మండలంలోని రామక్కపేట, చీకోడ్‌, ‌గంభీర్‌పూర్‌, ‌పోతారం, శిలాజీనగర్‌ ‌తదితర గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మట్లాడారు.

మంత్రి హరీష్‌రావు తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీల నేతలపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. బిజెపి నేతల పరిస్థితి సోషల్‌ ‌మీడియాకు ఎక్కువ.. పనికి తక్కువ అని ఎద్దేవా చేశారు.  పదేండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో రైతుల మోటార్లు కాలిపోవడం నిత్యకృత్యమయ్యేదనీ, కానీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక కరంటు బాధలు తప్పాయని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పాలనలో దొంగ చాటుగా కరంటు ఇస్తే రామక్కపేటలో బోర్లు కాలాయన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పరిస్థితి లేదని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply