Take a fresh look at your lifestyle.

నకిలీ విత్తనాలు అమ్మితే పిడియాక్ట్

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్‌ ‌రెడ్డి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పోలీస్‌ అధికారులను ఆదేశించారు.అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ ‌కమిషనర్లు,పోలీస్‌ అధికారులందరితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం వల్ల పంట దిగుమతి అధికంగా పొందే అవకాశం ఉంటుందని, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేస్తే ఆర్థికంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అందువల్ల పోలీస్‌ అధికారులంతా నకిలీ విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నకిలీ విత్తనాలను అడ్డుకోవాలని సూచించారు. అదే సమయంలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని, తెలంగాణలో నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని,తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని డిజిపి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా పతిష్టమైన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా కాపాడాలన్నారు.

నకిలీ విత్తన విక్రయదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, పి.డి.యాక్ట్ ‌కింద కేసులు నమోదు కేసులు నమోదు చేయమని ఆయన అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌మాట్లాడుతూ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను డిజిపి గారికి వివరించారు. ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూనే నకిలీ విత్తన విక్రయదారుల సమాచారం సేకరిస్తున్నామని, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో పాటు గత సంవత్సరం కేసులు నమోదు చేసిన వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎస్పీ వివరించారు.

Leave a Reply