Take a fresh look at your lifestyle.

సమస్యలుంటే ఫోన్‌ ‌చేయండి: కలెక్టర్‌ ‌దివ్యదేవరాజన్‌

Divya devarajan Collector
కలెక్టర్‌ ‌దివ్యదేవరాజన్‌

రైతులు పంటల సాగులో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని కలెక్టర్‌ ‌దివ్యదేవరాజన్‌ అన్నారు. పంటలు వేసే క్రమంలో విత్తనాల ఎంపిక విషయంలో సైతం వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తనకు ఫోన్‌ ‌చేసి సమస్యను విన్నవించవచ్చన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని కలెక్టర్‌ ‌దివ్యదేవరాజన్‌ అన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ఆహారం కల్తీ అవుతూ వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను సాగు చేయాలన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారన్నారు. సీసీఐ పత్తికి మద్దతు ధర రూ.5550 చెల్లించి కనుగోలు చేస్తున్నదని తెలిపారు. ప్రతి రైతు తమ పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్‌ ‌తీసుకు వస్తున్నారని తెలిపారు. ఇకపోతే అర్హత ఉన్నవారి పేర్లను ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. 18 ఏండ్లు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు. కళాశాలలు, సాంకేతిక కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ఓటుహక్కు లేని విద్యార్థులు ఫాం-6 పూరించి ఓటరు నమోదు చేయించాలని సూచించారు. ఇందుకోసం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాల సహకారం తీసుకోవాలన్నారు. సహాయ రిటర్నింగ్‌ అధికారులు వారి పరిధిలో కళాశాలలను సందర్శించి ఓటరు నమోదు చేయాలన్నారు. గ్రాణ స్థాయిలో బూత్‌ ‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి అర్హత ఉన్నవారిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. బూత్‌ ‌పరిధిలో ఓటర్ల వివరాలు కొత్తగా నమోదు చేయాల్సినవి, తొలగించాల్సినవి వంటి వివరాలను సరైన సమాచారంతో చేపట్టేలా చూడాలన్నారు. నమోదు చేసే ఓటర్ల వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ధ్రువీకరించుకోవాలన్నారు.బూత్‌ ‌స్థాయి అధికారులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ఓటరు జాబితా సక్రమంగా ఉంటుందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హౌజ్‌హోల్డ్ ‌రిజిస్టర్లు నిర్వహించామన్నారు. ఓటరు నమోదుకు అవసరమైన స్టేషనరీని సమకూర్చుకోవాలన్నారు.

Tags: collector divya devarajan, formers, adilabad, district collector

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!