Take a fresh look at your lifestyle.

మంచి అమ్మాయి దొరికితే పెళ్లికి సిద్ధమే!

న్యూ దిల్లీ, జనవరి 23 : పెళ్లి విషయంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 ఏళ్ల రాహుల్‌.. ‌తెలివైన అమ్మాయి భాగస్వామిగా దొరికితే చాలన్నారు. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమైనందున అమ్మాయి విషయంలో అంచనాలు చాలానే పెట్టుకుంటానని అన్నారు. రాజస్థాన్‌లో భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూను కాంగ్రెస్‌ ‌పార్టీ  తాజాగా సోషల్‌ ‌డియాలో రిలీజ్‌ ‌చేసింది.

ఇప్పుడది వైరల్‌ ‌గా మారింది. తంలోనూ రాహుల్‌ ‌పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. నాన్నమ్మ ఇందిరా గాంధీ నైజం.. అమ్మ  సోనియా గాంధీ సుగుణాలతో కూడిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని అన్నారు. నాయనమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పిన రాహుల్‌..  ‌తనకు ఆమె మరో మాతృమూర్తి అన్నారు. నాన్‌ ‌వెజ్‌ అం‌టే ఇష్టమన్న రాహుల్‌ ‌గాంధీ.. తెలంగాణ ఫుడ్‌ ‌స్పైసీగా ఉంటుందన్నారు.

Leave a Reply