Take a fresh look at your lifestyle.

మాస్క్ ‌లేకేంటే భారీ జరిమానా.. ఇంటికే చలానా

  • కొరోనా నివారణకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు
  • బహిరంగప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరన్న సీపీ అంజనీకుమార్‌

‌రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో ముఖానికి మాస్క్ ‌ధరించకుండా రోడ్లపై, వాహనాల్లో తిరిగే వారిని ఫోటోలు తీసి జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు నేటి(మంగళవారం) నుంచి ట్రాఫిక్‌ ‌పోలీసులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహిస్తున్నారు. మాస్క్ ‌లేకుండా ఎవరైనా బయట కనిపిస్తే వారికి భారీ జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌ ‌పోలీసులు నడుం బిగించారు.

మూడు పోలీస్‌ ‌కమిషనరేట్ల పరిధిలోని ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ‌పోలీసులు మాస్క్ ‌లేకుండా వెళ్తున్నవారి ఫోటోలు తీసి వాహనం నంబరు ఆధారంగా ఇంటికి ఈ-చలానాలను పంపనున్నారు. జరిమానా ఎంత విధించాలనేది మాత్రం ఇంక నిర్ణయించలేదు. ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే మాస్కులు లేకుండా వాహనాల్లో వెళ్తున్న వారిపై హైదరబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు 15 వేల కేసులు నమోదు చేశారు.

కాగా మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తించడంలో ట్రాఫిక్‌ ‌పోలీసులతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. బహిరంగప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరని సీపీ అంజనీకుమార్‌ ‌తెలిపారు. వారం రోజులు మాస్క్‌లపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 68, 69ను అమలు చేస్తామని సీపీ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో భారీగా గుమిగూడవద్దని సూచించారు. ఇతర రాష్టాల్లో్ర కేసులు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ కోవిడ్‌ ‌రూల్స్ ‌పాటించాలన్నారు.

Leave a Reply