Take a fresh look at your lifestyle.

‌ట్రంఫ్‌ ‌గెలిస్తే .. ప్రపంచ ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రశ్నార్థకమే

ఈ మధ్యకాలంలో ప్రపంచంలో కొన్ని దేశాదినేతల చర్యలను గమనించినట్లయితే అధికారాలు కేంద్రీకృతం చేస్తూ మళ్ళీ తామే అధికారంలోకి రావడానికి ట్రంఫ్‌ ‌వలే రాజ్యాంగ,ప్రజాస్వామ్య పంథాలనుంచి  దారి తప్పుతునట్లు కనిపిస్తుంది. అమెరికాలో ట్రంపు విధానాన్నే, బ్రెజిల్‌ ,ఇ‌జ్రాయిల్‌ ,‌బ్రిటన్‌ ‌రష్యా ,చైనా, కొంతవరకు ఇండియా దేశ పాలకులు అనుస రిస్తున్నట్లు  గమనించవచ్చు.రెండవసారి ట్రంఫ్‌ ‌గెలిస్తే, దారితప్పుతున్న ప్రజాస్వామ్య రైల్‌ ఇం‌జన్‌ అయినా ట్రంఫ్‌ ‌విధానాలనే ఆయన అనుచర రైలు డబ్బాలైన ఇతర దేశాధినేతలు అనుసరిస్తారు.ఈ విధానాలే యావత్‌ ‌ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చవచ్చు.
ట్రంపు ఎన్నికైనప్పటినుంచి ఆయన తీసుకున్న   వివాదాస్పదం నిర్ణయాలు అమెరికనే కాదు ప్రపంచాన్నే  గందరగోళనికి గురిచేస్తుంది. చైనాతో వాణిజ్య యుద్ధంగా మొదలై సంఘర్షణ,2019 మే నాటికి తీవ్రస్థాయికి చేరి,కరోనాతో ప్రత్యక్ష యుద్ధ సన్నహాలకు దారితీస్తుంది.”

గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠగా ఈసారి యావత్‌ ‌ప్రపంచ ప్రజలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకై ఎదురుచూస్తున్నారంటే ఆ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందొ అర్థం చేసుకోవచ్చు.ఈ ఎన్నికల ఫలితాలు కేవలం అమెరికాకే కాదు యావత్‌ ‌ప్రపంచదేశాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  ప్రభావితం చేసేవే.
ప్రపంచం ఎన్నడూ ఎదుర్కొని విపత్కాల  పరిస్థితి 2017 నుంచి ఎదుర్కొంటుందంటే ట్రంఫ్‌ అమెరికా అధ్యక్షుని హోదాలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే కారణం.ఈ మధ్యకాలంలో ప్రపంచంలో కొన్ని దేశాదినేతల చర్యలను గమనించినట్లయితే అధికారాలు కేంద్రీకృతం చేస్తూ మళ్ళీ తామే అధికారంలోకి రావడానికి ట్రంఫ్‌ ‌వలే రాజ్యాంగ,ప్రజాస్వామ్య పంథాలనుంచి  దారి తప్పుతునట్లు కనిపిస్తుంది. అమెరికాలో ట్రంపు విధానాన్నే, బ్రెజిల్‌ ,ఇ‌జ్రాయిల్‌ ,‌బ్రిటన్‌ ‌రష్యా ,చైనా, కొంతవరకు ఇండియా దేశ పాలకులు అనుస రిస్తున్నట్లు  గమనించవచ్చు.రెండవసారి ట్రంఫ్‌ ‌గెలిస్తే, దారితప్పుతున్న ప్రజాస్వామ్య రైల్‌ ఇం‌జన్‌ అయినా ట్రంఫ్‌ ‌విధానాలనే ఆయన అనుచర రైలు డబ్బాలైన ఇతర దేశాధినేతలు అనుసరిస్తారు.ఈ విధానాలే యావత్‌ ‌ప్రపంచ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చవచ్చు.
ట్రంపు ఎన్నికైనప్పటినుంచి ఆయన తీసుకున్న   వివాదాస్పదం నిర్ణయాలు అమెరికనే కాదు ప్రపంచాన్నే  గందరగోళనికి గురిచేస్తుంది. చైనాతో వాణిజ్య యుద్ధంగా మొదలై సంఘర్షణ,2019 మే నాటికి తీవ్రస్థాయికి చేరి,కరోనాతో ప్రత్యక్ష యుద్ధ సన్నహాలకు దారితీస్తుంది.
ట్రంఫ్‌ ‌వాణిజ్య విషయంలో మిత్రదేశాలైన నాటో,యూరోపియన్‌ ‌యూనియన్‌,‌జపాన్‌, ఇం‌డియా తో సైతం విభేదాలు పెంచు కున్నాడు.ట్రాన్స్- ‌పసిఫిక్‌ ‌పర్ట్నర్షిప్‌ (‌టి పి పి), ఫ్యారిస్‌ ‌క్లైమేట్‌ అ‌గ్రిమెంట్‌ ‌వంటి అంతర్జాతీయ ఒప్పందాలను నుంచి విరమించుకున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగారు. ప్రపంచ వాణిజ్య సంస్థపై ఒత్తిడి పెంచారు.2017 లో ఆరు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులను 90 రోజులు అమెరికాకు రాకుండా నిషేధించాడు. 2017లో  జేరుసేలెంను ఇజ్రాయిల్‌ ‌రాజధానిగా గుర్తించి టెల్‌అవివ్‌ ‌నుంచి తన రాయబార కార్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేశాడు.
ఇరాన్‌ ‌న్యూక్లియర్‌ ‌డీల్‌ అని పిలువబడే జాయింట్‌ ‌కాంప్రహెన్సి ప్లాన్‌ ఆఫ్‌ ‌యాక్షన్‌ 2015 ‌నుండి అమెరికాను ఏకపక్షంగా ఉపసంహరిం చుకోవాలని 2018లో ట్రంఫ్‌ ‌తీసుకున్న నిర్ణయం మధ్య ప్రాచ్యం అంతటా గందరగోళాన్ని సృష్టించింది. జనరల్‌ ‌ఖాసేమ్‌ ‌సోలైమానిని హత్య చేయడం ద్వారా ఇరాన్‌ ‌తో ఉద్రిక్తతలు పెరిగాయి. ట్రంఫ్‌ 2018 ‌జూన్‌ ‌లో ఉత్తరకొరియా నాయకులు కిమ్‌-‌జోంగ్‌-ఉన్‌ ‌తో సింగపూర్‌ ‌లో సమావేశమై  సైనిక సంది చేసుకోవడంతో పాటు ,ఉత్తరకొరియాకు రాయితీలు ప్రకటించి ప్రపంచాన్ని, దక్షిణ కొరియాను, పెంటగాన్ని ఆశ్చర్యపరచారు.
యూఎస్‌, ‌మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ నిధుల కోసం ట్రంఫ్‌ ‌చేసిన డిమాండు ఫలితంగా నెలరోజులపాటు  ప్రభుత్వం స్తంభించిపోయింది. దీనితో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాడు. ఆ సందర్భంగానే నిధుల కొరకు వీటో అధికారాన్ని ఉపయోగించాడు. తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్‌ ‌పై దర్యాప్తు ప్రారంభించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పై ఒత్తిడి చేసి అతను ఒప్పుకోకపోయేసరికి రష్యన్‌ అనుకూల వేర్పాటువాదులపై కొనసాగిస్తున్న యుద్ధం కోసం  కాంగ్రెస్‌ ఆమోదం పొందిన 400 బిలియన్‌ ‌డాలర్ల సహయాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. దీనిపై ప్రతినిధుల సభ 2019 సెప్టెంబర్‌ ‌లో నేరవిచారణ చేసింది. డిసెంబర్‌ ‌లో ట్రంఫ్‌ అభిశంశనను ఎదుర్కొన్నారు.అమెరికా అధ్యక్షుని చరిత్రలోనే అభిశంశనను ఎదుర్కొన్న  మూడవ అధ్యక్షుడు ట్రంఫ్‌. ఉటా కు చెందిన మిట్‌ ‌రోమ్నీ  ట్రంఫ్‌ ‌ను దోషిగా నిర్దారించడానికి ఓటు వేయడం ద్వారా చరిత్ర సృష్టించారు. ఒక సెనేటర్‌ ‌తన సొంత పార్టీకి చెందిన అధ్యక్షున్ని శిక్షించాలని ఓటు వేయడం అమెరికా చరిత్రలో మొదటి సంఘటన. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంఫ్‌ ‌యొక్క ఎన్నికల బృందం రష్యా ఏజెంట్లతో కుమ్మక్కయిందనే ఆరోపణల మధ్య జాతీయ భద్రత సలహాదారుడు మైఖేల్‌ ‌ప్లీన్‌ ‌ను తొలగించారు.
ప్రజలచేత ఎన్నికైన  ఆఫ్ఘన్‌ ‌ప్రభుత్వాన్ని కాదని ఉగ్రవాద తాలిబాన్స్ ‌తో ఒప్పందం చేసుకో వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇజ్రాయిల్‌ ‌విషయంలో మానవ హక్కుల మండలి నుంచి అమెరికా వైదొలుగుతుందని 2018లో ఐరాస లో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు.
2018 లో నాప్టాల్‌ ‌స్థానంలో యుఎస్‌, ఎం‌సిఎ ఒప్పందం చేసుకున్నారు.కుర్దిష్‌ ‌నియంత్రణలో ఉన్న ప్రాంతం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడంతో టర్కీ సిరియాపై దాడి చేసింది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ‌ప్రజలపై సారిన్‌ ‌రసాయన ఆయుధాన్ని ఉపయోగించారని ప్రతీకారంగా క్రూయిజ్‌ ‌క్షిపణి దాడులకు ట్రంఫ్‌ అవకాశం ఇచ్చారు.
కొవిడ్‌-19 ‌ఘోరంగా  వ్యాప్తి  చెందటంవల్ల మరణించిన వారి సంఖ్య 1945 నుంచి యుద్ధంలో మరణించిన అమెరికా సైనికులకంటే  ఎక్కువ. వైరస్‌ ‌పట్ల ట్రంఫ్‌ ‌యొక్క అనాలోచిత విధానం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని తిరస్కరించే ధోరణి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది.ఈయన చర్యలు విదేశాల్లో ఉదారవాద సంస్థలకు మద్దతు ఇవ్వడంలో  అమెరికా విశ్వసనీయతను బలహీన పరుస్తున్నాయి.ట్రంఫ్‌ ‌వ్యవహార శైలి వల్ల స్వేచ్ఛ ప్రపంచాన్ని నడిపించడంలో  వాషింగ్టన్‌ ‌సామర్ధ్యాలపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈయన వ్యవహారం వల్ల  ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఎస్టోనియా నుంచి,ప్రజా ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో తైవాన్‌ ‌నుంచి అమెరికా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది.
జాత్యహంకారం,వలస వ్యతిరేక ద్వేషం,శ్వేతజాతి ఆధిపత్యం, క్రూరత్వం, నకిలీ వార్తల వ్యాప్తి మొదలైన చర్యలు, స్వతంత్ర సంస్థల, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల,నేర పరిశోధన, దౌత్యసేవ, పర్యావరణ సంస్థల స్వాతంత్రాన్ని నాశనం చేస్తున్నాయి. రిపబ్లిక్‌ ‌గవర్నర్‌ ‌ల ద్వారా పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ‌నియమాలను మార్చడం,రిపబ్లికన్‌ ‌విధానాలకు మద్దతిచ్చే న్యాయమూర్తిని చట్టానికి విరుద్ధంగా నియమించడం,వాషింగ్టన్‌ ‌ని అవినీతిమయం చేయడం,యుఎస్‌ ‌లో విఫలమైన ఆరోగ్య సంరక్షణ చర్యలు,నియంత్రణ లేని ఆర్థిక-ద్రవ్య విధానాలు, పెరుగుతున్న పోలీస్‌ ‌చర్యలు, వేగంగా దిగజారుతున్న వాతావరణ పరిస్థితులు, మౌలిక సౌకర్యాల లోటు, ముక్కలౌతున్న ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల విధానాలపై దాడి మొదలైనవి ట్రంఫ్‌ ‌కాలంలో అమెరికాలో అగుపడుతున్నాయి. నల్లజాతీయుడైన జార్జి ఫ్రాయిడ్‌  ‌హత్యఉదంతం,తదనంతరం ట్రంఫ్‌ ‌వ్యవహార శైలి అమెరికా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలుగా మిగిలాయి.నోబెల్‌ ‌బహుమతి గ్రహితలైన కొందరు అమెరికన్‌ ‌వ్యక్తులు ట్రంఫ్‌ ‌ని ఓడించాలని సైన్స్ ‌పత్రికల్లో వ్యాసాలు రాయడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. ఎన్నికల్లో జో బైడాన్‌ ‌గెలిస్తే కరోనాను ఎదు ర్కోవ డంలో టెస్ట్ అం‌డ్‌ ‌ట్రెస్స్ ‌కార్యక్రమాన్ని అమెరి కాలలో ప్రారం భిస్తూ, వ్యాక్సిన్‌ ‌విష యంలో ప్రపంచదేశాలకు సహకరిస్తూ, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పని చేస్తానని ప్రకటి ంచడం, ఫ్యారిన్‌ ‌వాతా వరణ ఒప్పందంలో తిరిగి చేరడం,ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు కేటాయించడం,
మరో ప్రచ్ఛన్న యుద్ధానికి కారణం అవుతున్న చైనాతో సంఘర్షణలు తగ్గుముఖంపట్టడం  లాంటి మార్పులను ఆశించవచ్చు.
భారతదేశంలో మోడీ ప్రభుత్వం ట్రంపుకు సంపూర్ణ మద్దతు ఇచ్చినప్పటికీ ఇరాన్‌,‌వెనిజులా నుంచి చౌకగా సప్లై అవుతున్న చమురు-గ్యాస్‌ ‌ని నిలుపుదల చేసుకొని అమెరికా నుంచి ఖరీదైన కొనాలని ఒత్తిడి చేయడం,భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో రష్యా నుంచి ఆయుదాలు కొనుగోలు చేయకుండా నిలువరించే చట్టాల నుంచి భారతదేశానికి మినహాయింపు ఇవ్వకపోవడం, ఉక్కు- రబ్బర్‌ ‌సుంకాలను పెంచడ,భారత ఎగుమతులపై ఉన్న ప్రాధాన్యతను  తొలగించడం,హెచ్‌1‌బీ వీసాల పై ఆంక్షలు విధించడం, భారత్‌ ‌లాంటి దేశాలకు ఎంతో అనుకూలమైన వాతావరణ ఒప్పందం నుంచి బయటకు రావడం ,భారతదేశాన్ని మురికి దేశంగా అభివర్ణించడం, హైడ్రాక్సీక్లోరోఫిన్‌ ‌మాత్రలు ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకుంటానని అనడం మిత్రుడైన ట్రంఫ్‌ ‌నుంచి భారతదేశం పొందిందని చెప్పవచ్చు.
బైడాన్‌ ‌గెలిస్తే ఇమ్మిగ్రేషన్‌ ‌విధానాలు భారత దేశానికి ఉపయోగకరంగా మారడం, గ్రీన్‌ ‌కార్డులు ఇచ్చే సంఖ్య పెరుగనుండడం, భారత్‌ అమెరికా రక్షణ సంబంధాలు కొనసాగడం, వాణిజ్యం,ఐటీ రంగాలలో వృద్ధిని ఆశించవచ్చు.
చైనా విషయములో భారత్‌ ‌కు ట్రంఫ్‌సహకరించినంతగా జో బైడాన్‌ ‌సహకరిం చకపోవచ్చు.
ప్రపంచ ప్రజాస్వామ్య వాదుల ఆవేదన ట్రంఫ్‌ ‌దుందుడుకు చర్యలే.ఆ చర్యల వల్ల బలహీ నపడుతున్న అంతర్జాతీయ సంస్థలు, వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకం కావడమే. ప్రపంచ ప్రజాస్వామ్య భవిష్యత్తు పాతాళంలోకి నెట్టి వేయబడకుండా ఉండాలంటే అమెరికా లో ప్రజాస్వామ్యం గెలుపొందాలి.
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్‌, 9494019270.

Leave a Reply