Take a fresh look at your lifestyle.

కేంద్ర మంత్రిని అరెస్టు చేయకుంటే నిరనసలు తీవ్రం రైతు సంఘాల నేత తికాయత్‌

లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో ప్రమేయమున్న కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌మిశ్రాను వెంటనే ఆ పదవి నుంచి తక్షణం తొలగించి, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేందుకు వీలుగా ఆయనను అరెస్టు చేయాలని భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బీకేయూ) నేత రాకేష్‌ ‌తికాయత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అజయ్‌ ‌మిశ్రాను పదవి నుంచి తొలగించకుంటే నిరసనలను తీవ్రతరం చేస్తామని అన్నారు. లఖింపూర్‌ ‌ఘటనపై దర్యాప్తు పట్ల తికాయత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అజయ్‌ ‌మిశ్రాపై సెక్షన్‌ 120‌బి కింద కేసు నమోదు చేయాలని, ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నారని, రైతులను ఆయన హెచ్చరిస్తున్న వీడియో ఒకటి బయటకు వొచ్చిందని, లఖింపూర్‌ ‌ఘటన వెనుక ఆయన ఉన్నారని తికాయత్‌ అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా, ఆరెస్టుకు ఒత్తిడి తీసుకురావడం కోసమే రైల్‌రోకోకు పిలుపునిచ్చామని, మంత్రిని ఆ పదవి నుంచి తప్పించేంత వరకూ నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని ఆయన అన్నారు. రైతులపై కార్లు నడిపి వారి మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్‌ ‌మిశ్రాను పోలీసులు ‘రెడ్‌ ‌కార్పొట్‌’ అరెస్టు చేయడం రైతుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచుతుందని అన్నారు. సిట్‌ ‌దర్యాప్తును మంత్రి ప్రభావితం చేస్తున్నారని తికాయత్‌ ఆరోపించారు.

Leave a Reply