Take a fresh look at your lifestyle.

‘‌కారు’లో ముసలం

Secret meeting of Assamese leaders

  • టికెట్‌ ఇవ్వకపోతే ఓడిద్దాం
  • అస్సమతి నేతల రహస్య సమావేశం
  • కాసుల ఉన్న వాడికే కారు టికెట్‌ !  
  • ‌వర్గపోరులో నలిగిపోతున్న కార్యకర్తలు

మానుకోట మున్సిపల్‌ ఎన్నికల పోరు అధికార తెరాసలో ‘‘ మున్సిపల్‌ ఎన్నికల ముసలం పుట్టింది ‘‘ గత ఎన్నికలో గెలిచినవారికి బి ఫారం ఇవ్వకుండా కాసులు వున్నవారికి మాత్రమే పార్టీ టికెట్లు ఇవ్వడంతో అధికార పార్టీ లో అంతర్యుద్ధం మొదలైందీ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గత ఎన్నికలో 29 వార్డులు ఉండగా ఈసారి చుట్టారా వున్నా గ్రామాలూ విలీనం చేసి 36 వార్డులుగా మార్పులు చేశారు కొత్తగా కలిసిన వార్డులు తో పటు పాత వార్డులలో మొత్తం మార్పు చేయడంతో ప్రతి పక్ష పా ర్టీలకు కొంత నిరాశ చెందినప్పటికీ అధికార పార్టీకి మాత్రం తమ నేతలతోనే కొత్త ముప్పు సంబవించింధీ ఎన్నో ఏండ్లుగా పార్టీ కి సేవ చేసిన ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సీటు దక్కించుకోవాలని ఆశించిన కొత్తగా డబ్బులు న్నవారికి మాత్రమే సీట్లు ఇవ్వడం తో ఆశించి ఆశించి భంగపడ్డవారు కొత్తగా వచ్చినవారికి సహకరించమని బాహాటంగానే చెబుతున్నారు .

అసమ్మతి నేతల రహస్య సమావేశం
మున్సిపాలిటీ ఎన్నికల్లో సీట్లు ఆశించి బంగపడ్డ వారితోపాటు గత ఎన్నికలో గెలిచి ఈ ఎన్నికల్లో సీట్లు దక్కనివారు బుజ్జగించిన పార్టీ లో ఉంటూనే వేరేపార్టీకి సహకరించాలనుకుంటున్నట్లు అస్సమతి నేతలు పార్టీ ముఖ్య నేత తో రహస్య సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం . మనకు సీటు రాకుంటే ప్రతి పక్ష పార్టీలకు సహకరించాలని అలాచేస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు రావని అనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ముగ్గురు నేతల వర్గపోరు?
జిల్లాలో అధికార తెరాస పార్టీ కి ముగ్గురు ముఖ్య నాయకుల వర్గపోరు నడుస్తుంది రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎం‌పీ కవిత ఎమ్మెల్యే శంకర్‌ ‌నాయక్‌ , ‌వర్గాలుగా విడిపోయే బహిరంగంగా మాత్రం అందరం ఒకటే అని నినదిస్తూ లోలోన మాత్రం ఎవరికి వారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు . పార్టీ అధిష్టానం, చైర్మన్‌ అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పినప్పటికీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి అధిష్ఠానం అభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నారని ఒకవర్గం నాయకులూ చర్చిన్చుకుంటున్నారు .ఇది ఇలా వుంటే ముగ్గురు ముఖ్య నేతలు ఎవరి అణూనుయులను వారు వార్డులలో నిలిపి చైర్మన్‌ ‌పదవిని ఇరాటంలో పెట్టారు. దీంతో ముగ్గురు నేతలు జిల్లా రాజకీయాల్లో కొట్టుకుంటూ ఉంటే వార్డులలో మాత్రం అధికార పార్టీ నేతలే సహకరించుకోవడందు. ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవంటూ రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply