Take a fresh look at your lifestyle.

జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా

  • కుర్‌కురేలు పంచిన కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు చేయడమా
  • రాష్ట్రానికి ఓ నాలుగు మంచి పనులయినా చేశారా
  • ఇప్పుడు  ట్రైలర్‌ ‌మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం
  • మోదీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పాలి
  • సెస్‌ ‌పాలకమండి సభలో మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు

రాజన్నసిరిసిల్ల,ప్రజాతంత్ర,జనవరి10: జిఎస్టీ వసూళ్లు, రాష్టాన్రికి కేటాయింపులపై కేంద్రంపై మంత్రి కెటిఆర్‌ ‌మరోమారు మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు. తాను చెప్పే లెకకలు తప్పయితే మంత్రిపదవి విసిరి అవతల పడేస్తానని సవాల్‌ ‌చేశారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద 3 లక్షల 68 వేల కోట్లు కేంద్రానికి కడితే.. లక్షా 68వేల కోట్లు మాత్రమే ఇచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. తాను చెప్పిన లెక్క తప్పని నిరూపిస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేసి  మొఖాన పారేస్తానని కేటీఆర్‌ ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడారు. సెస్‌ ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ ‌రూ.5కోట్లు తీసుకు వచ్చాడని.. అభ్యర్థులు ఆగమై తనకు ఫోన్లు చేశారని చెప్పారు. డబ్బులు పంచినోళ్లే మళ్లీ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ ‌పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా దిశానిర్దేశర చేసిందన్నారు.

సెస్‌లో గెలువలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా?.. మొన్న చూసింది ట్రైలరే.. 2023లో అసలు సినిమా చూపిస్తాం అన్నారు. తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని.. మెదడు ఎక్కడుంది? మోకాళ్లలో ఉందా?.. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్ల అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని, సిరిసిల్ల జిల్లా సెస్‌ ‌పరిధిలో ప్రత్యేక విద్యుత్‌ ‌ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎన్ని నిధులైనా ఇప్పిస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి దేవుడు.. నీకా గుజరాత్‌ ‌కా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని నిలదీశారు. పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు పెంచినోడని, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడట.. చేనేత ద పన్నువేసినోడు దేవుడా అంటూ నిలదీశారు. డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు పెంచుతూ.. ఆర్టీసీ ధరలు పెంచొద్దంటారని.. మరి బస్సులు ఎలా నడుపమంటారని ధ్వజమెత్తారు. కేంద్ర ధరలు పెంచడంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుందన్న కేటీఆర్‌.. ఆ ‌రెండు రాష్టాల్ల్రో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. రాష్టాల్రగొడవ పరిష్కరించని మోదీ రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఆపారా అని ప్రశ్నించారు.

14 మంది ప్రధానులు చేసిన అప్పు.. ఎంతో ..అంతమొత్తం మోదీ ఒక్కరే చేశారని విమర్శించారు. కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని విమర్శించిన కేటీఆర్‌.. ‌తెలంగాణకు కేంద్ర నిధుల విషయంలో సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు.  తన మంత్రి పదవికి రాజీనామా చేసి  మొఖాన పారేస్తానని కేటీఆర్‌ ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. గుజరాత్‌ ‌వాళ్లు వస్తే చెప్పులు మోయడానికి పని చేస్తారని, నాలుగేళ్లలో కరీంనగర్‌కు ఎంపీగా ఉండి బండి సంజయ్‌ ఏం ‌చేశాడో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ట్రిపుల్‌ ఐటీ, నవోదయ పాఠశాలలు తీసుకువచ్చావా? అంటూ నిలదీశారు. రాజరాజేశ్వరస్వామికి రూ.10 చందా అయినా రాయించావా? అంటూ ధ్వజమెత్తారు. ఈ సారి కరీంనగర్‌ ‌పార్లమెంట్‌పై గులాబీ జెండాను ఎగురవేద్దామని, సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి.. ఇక్కడి నుంచే కరీంనగర్‌ ‌గులాబీ జెండా ఎగురవేద్దామని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ్ ‌సర్వేక్షణ్‌లో సిరిసిల్ల ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు సిరిసిల్ల ఒక దిక్సూచి అని చెప్పారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కన్నా మోడీ 100 రెట్లు ఎక్కువ చేసినా రాష్టాన్రికి మాత్రం మొండి చేయి చూపారని కేటీఆర్‌ ‌విమర్శించారు. దేశంలో 20 అత్యుత్తమ గ్రామ పంచాయితీల్లో 19 తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్‌ అయినా బీజేపీ నేతలు రాష్టాభ్రివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగి వస్తుందని.. అందుకే అలాంటి అబద్దాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. మోడీ గుజరాత్‌ ‌దొస్తుల కోసమే దేశాన్ని నడిపిస్తున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు. 12 లక్షల కోట్ల రుణాలను కార్పొరేట్‌ ‌దోస్తులకు మాఫీ చేశారన్నారు. తాను చెప్పేది అబద్దం అయితే దేనికైనా రెడీ అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ అప్పు‌తో పాటు అభివృద్ధి కూడా చేశారని చెప్పారు. ఈ సభలో మాజీ ఎంపి వినోద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply