Take a fresh look at your lifestyle.

డిమాండ్‌ ‌కలిగిన పంటలు వేస్తే.. రైతులకు లాభం

  • ఎన్నో విధాల ఆలోచించే పంటల మార్పిడి నిర్ణయం
  • రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం
  • ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతు వేదికను నిర్మించి ఇస్తా
  • పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి
  • నియంత్రిత పంటల సాగు విధానంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో డిమాండ్‌ ‌కలిగిన పంటలు వేస్తేనే రైతులకు లాభం వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎన్నో విధాలుగా ఆలోచించిన తరువాతనే ప్రభుత్వం రాష్ట్రంలో పంటల సాగు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. గురువారం ప్రగతి భవన్‌లో పంటల మార్పిడి విధానంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానంపై అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. దీని ద్వారా రైతులు వందకు వంద శాతం లాభాలు ఆర్జించాలన్నది తన అభిమతమని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీపడే గొప్ప రైతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. రైతులకు సంఘటితంగా శక్తివంతంగా తీర్చిదిద్దే సంకల్పంతో రైతు బంధు సమితిలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్‌ ‌పడిపోయిన నష్టపోతున్నారనీ, భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాష్ట్రంలో గతేడాది వర్షాకాలంలో 40 లక్షల ఎకరాలలో సాగు చేసుకున్నారనీ, ఇప్పుడు కూడా అంతే స్థాయిలో సాగు చేసుకోవచ్చన్నారు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవడం ద్వారా కూడా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులంతా వంద శాతం రైతు బంధు సాయం పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంటల మార్పిడి సాగు విధానాన్ని అధిక శాతం రైతులు స్వాగతిస్తున్నట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు.

దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ వర్సిటీ తగిన సూచలను అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ జీవితం ఉజ్వలంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఏ సీజన్‌లో ఏ పంట వేయాలి ? ఎక్కడ ఏ పంట వేయాలని అనే అంశాలను వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తారని తెలిపారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం రైతులు పంటలను సాగు చేస్తే నష్టం వచ్చే అవకాశాలు ఉండవని చెప్పారు. గతేడాని 7 లక్షల ఎకరాలలో కం•ది పంటను సాగు చేశారనీ, ఈసారి 15 లక్షల ఎకరాలలో కంది పంటలను సాగు చేయాలనీ, అలాగే, 70 లక్షల ఎకరాల దాకా పత్తి పంటలను సాగు చేసుకోవచ్చని తెలిపారు. యాసంగిలో మక్కలు సాగు చేసుకోవచ్చనీ, పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. తెలంగాణకు సోనా వరి రకానికి భారీ డిమాండ్‌ ఉం‌దనీ, తన వ్యవసాయ క్లస్టర్‌లో ఎర్రవెల్లిలో రైతులకు రైతు వేదికను నిర్మించి ఇస్తానని వెల్లడించారు. రైతు వేదికల నిర్మాణానికి స్థలం, నగదు సహాయం చేసిన దాతలు సూచించిన పేర్లనే వాటికి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలనీ, రైతు వేదికల నిర్మాణానికి ముందుకు వచ్చిన మంత్రులను అభినందించారు. ఏ పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉం‌దో ఆగ్రో బిజినెస్‌ ‌వారు తేల్చారనీ, దాని ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలనీ, విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్మే వరకు రైతు వేదికలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశించారు.

Leave a Reply