Take a fresh look at your lifestyle.

సిఎం ఢిల్లీలో ఉంటే ధాన్యం కొనే దిక్కేది

  • ఎవరు బాధ్యులో రైతులకు చెప్పాలి
  • సిఎం వొచ్చే లోపు ధాన్యం మొలకెత్తేలా ఉంది
  • అమిత్‌షాతో కలిసాక ఢిల్లీపై యుద్దం లేదనడం ఆనవాయితే
  • కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత భట్టి విక్రమార్క

ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ ‌కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరన్నారు. ఢిల్లీలో కేసీఆర్‌ ‌తేల్చుకుని వొచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వొచ్చేలా ఉన్నాయని భట్టి ఎద్దేవా చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్‌ ‌షాను కలవగానే యూటర్న్ ‌తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్‌ ‌షాను కలుస్తానని అంటున్నారన్నారు. ధాన్యం రోడ్ల వి•ద ఉందని దాన్ని వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చాలని  భట్టి విక్రమార్క డిమాండ్‌ ‌చేశారు. మంళవారం వి•డియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోతే కేంద్రంతో తేల్చుకునే లోపు ఇక్కడ రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. వడ్లు ముందు కొనాలని ఆయన అన్నారు. దళిత బంధు ఎన్నికల వెంటనే మొదలు పెడతామని అన్నారు.

ఇంకా ఎందుకు ప్రభుత్వం మొదలు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. మా దగ్గర ఇంకా సర్వే మొదలు కాలేదు.. ఏం చేస్తారో చూడాలని భట్టి విక్రమార్క అన్నారు. అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడాని స్వాగతిస్తున్నామని, అయితే ఢిల్లీలో అమరులైన రైతులకు ఇచ్చినట్లే తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు కెసిఆర్‌ ‌న్యాయం చేస్తానని ఏడున్నర ఏళ్ళు అవుతున్నా న్యాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. 12 వందల మంది అమరులకు న్యాయం చేస్తామంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశాం. ఇప్పటి వరకు అమరుల కుటుంబాలకు ఉద్యోగం-10 లక్షలు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇస్తామని ఇవ్వలేదు.

రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అంటూ ఆయన ప్రశ్నించారు. నీళ్ల పంచాయతీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమస్యల లెక్కన చూస్తున్నారు. దీనిపై అసలు ఏం జరుగుతుందో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్యన జరుగుతున్న చర్చల సారాంశం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ‌స్పష్టతను ఇవ్వాలన్నారు.  రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరని, దీనికి ఎవరు బాధ్యులో చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని భట్టి కోరారు.

Leave a Reply