Take a fresh look at your lifestyle.

పెగాసస్‌పై ఆరోపణలు నిజమైతే తీవ్రంగా పరిగణిస్తాం

  • వార్తా కథనలు కాకుండా ఆధారాలు ఉన్నాయా
  • ప్రభావితమయ్యామంటున్న వారు ఎందుకు ఫిర్యాదు చేయలేదు
  • జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ప్రశ్న
  • కేంద్ర దర్యాప్తు సంస్థ ఎందుకు కేసు నమోదు చేయలేదు : పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌
    ‌విచారణ ఆగష్టు 10కి వాయిదా

‌పెగసస్‌పై వొచ్చిన వార్తలు నిజమైనవైతే..ఆరోపణలు చాలా తీవ్రమైన అంశంగానే పరిగణిస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వీ రమణ అన్నారు. విచారణ ప్రారంభించేందుకు ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పెగసస్‌పై వొస్త్తున్న వార్తలు నిజమైతే.. ఆరోపణలు చాలా తీవ్రమైనవనటంలో ఎలాంటి సందేహం లేదు. 2019లోనే పెగసస్‌ ‌వెలుగులోకి వొచ్చింది. దీనిపై మరింత సమాచారం పొందే ప్రయత్నం జరిగిందా? అనేది తెలియదు. కొందరు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని చెబితే..అది టెలిగ్రాఫ్‌ ‌చట్టం కిందకు వొస్తుంది. ఆ ప్రకారమే ఫిర్యాదులు చేయాలని ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్‌లు, జడ్జిలు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు సహా పలువురు ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్‌ ‌కోసం పెగసస్‌ ‌స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్ ‌గిల్డ్ ఆఫ్‌ ఇం‌డియా, సీనియర్‌ ‌జర్నలిస్ట్‌లు ఎన్‌ ‌రామ్‌, ‌శశికుమార్‌ ‌సహా పలువురు దాఖలు చేసిన దాదాపు 9 పిటిషన్లపై గురువారం సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే పలువురు దాఖలు చేసిన రిట్‌ ‌పిటీషన్లలో అంశాలు సరిగా లేవని, అనుభవజ్ఞులు పిటిషన్‌ ‌దాఖలు చేసినట్లుగా లేదని సీజే అన్నారు.

ఫోన్లు హ్యాక్‌ అయినట్లు చెబుతున్న కొందరు..మరెందుకు క్రిమినల్‌ ‌కేసును దాఖలు చేయలేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎడిటర్స్ ‌గిల్డ్ ఆఫ్‌ ఇం‌డియా, సీనియర్‌ ‌జర్నలిస్ట్‌లు ఎన్‌. ‌రామ్‌, ‌శశికుమార్‌? ‌సహా ఇతర పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ ‌న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పత్రికల్లో వొచ్చిన కథనాలు కాకుండా వి• దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని సీజే ప్రశ్నించగా.. చాలా మెటీరియల్స్ అం‌దుబాటులో లేవని, అయితే పిటిషన్లలో ఫోన్‌లలోకి నేరుగా చొరబడిన 10 కేసులకు సంబంధించిన సమాచారం ఉందని కపిల్‌ ‌సిబల్‌ ‌కోర్టుకి తెలిపారు. పెగాసస్‌ ‌స్పైవేర్‌ ఓ ‌దారుణమైన టెక్నాలజీని అని, అది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ప్రవేశించిందని కోర్టుకి సిబల్‌ ‌తెలిపారు. అది గోప్యత, గౌరవం, గణతంత్ర విలువలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.

ఈ స్పైవేర్‌ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకే విక్రయించారని, ప్రైవేటు సంస్థలకు కాదని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ఎన్‌ఎస్‌ఓ ‌పాత్ర ఉందని తెలిపారు. స్పైవేర్‌ ‌టెక్నాలజీని కేవలం గవర్నమెంట్‌ ఏజెన్సీలకు మాత్రమే అమ్ముతారని, దాన్ని ప్రైవేటుగా అమ్మలేరని సిబల్‌ ‌తెలిపారు. ఎన్‌ఎస్‌ఓ ‌టెక్నాలజీ కంపెనీ అంతర్జాతీయంగా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కాలిఫోర్నియా కోర్టులో ఎన్‌ఎస్‌ఓపై దాఖలు అయిన ఓ పిటిషన్‌ ‌గురించి సిబల్‌ ‌సుప్రీమ్‌ ‌ధర్మాసనానికి వివరించారు. ఈ స్పైవేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు.. దాని హార్డ్ ‌వేర్‌ ఎక్కడ పెట్టారు..ఈ కేసులో ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌ ఎం‌దుకు నమోదు చేయలేదు? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానమివ్వాలని కపిల్‌ ‌సిబల్‌ ‌కోరారు. ఈ వ్యవహారంపై స్పందించేలా.. కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని సీజేఐని కోరారు సిబల్‌. ‌వాదనల అనంతరం.. వ్యాజ్యాల కాపీలను కేంద్రానికి అందించాలని పిటిషనర్లకు ధర్మానసనం సూచించింది. అనంతరం విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

Leave a Reply