కాంగ్రెస్ గెలుపుతోనే సుపరిపాలన సాధ్యం
డియాతో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : కొత్త రాష్ట్రమని రెండోసారి కేసీఆర్‌కు అవకాశం ఇస్తే, ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నిధులు, నియామకాలు లేకుండా దోపిడీ చేశారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పిందని..9 ఏళ్ళలో 18 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వాలు చెప్పిన మాటలు చేతల్లో లేవని భట్టి విక్రమార్క అన్నారు. లౌకిక వాదానికి భిన్నంగా కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యాలపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీలకు భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించిందని, ఇప్పుడు వాళ్లు రిజర్వేషన్లు కల్పించేది ఏమిటని మండిపడ్డారు. మంగళవారం హనుమకొండలో ఆయన డియాతో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్-బీజే