Take a fresh look at your lifestyle.

చిత్తశుద్ది ఉంటే దాడులపై సిబిఐ విచారణ జరపాలి

  • మాదక ద్రవ్యాల రవాణా గుట్టు విప్పాలి
  • వైసిపి తీరుపై మండిపడ్డ టిడిపి నేత పయ్యావుల కేశవ్‌

అమరావతి,అక్టోబర్‌ 22 : ‌ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుధ్ధిటే,టీడీపీ  కార్యాలయంపై దాడిఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్‌  అన్నారు. అంతర్జాతీయస్థాయి నుంచి దేశీయంగా ఎక్కడ మాదక ద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా ఏపీపేరే ఎందుకు వినిపిస్తుందో సీఎం, డీజీపీ ఆలోచించాలని అన్నారు. కేసులు, దాడులతో ప్రతిపక్షాలను అణచివేయడం దేశప్రధానులుగా ఉన్నవారివల్లే కాలేదన్నారు.? పోలీస్‌ అమరవీరుల దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్షంపై నిందారోపణలు చేశారు.. తాము, తమపార్టీ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నించి, కొత్తభాష్యాలు చెప్పడానికి ప్రయత్నించి భంగపడ్డారని పయ్యావుల కేశవ్‌ ‌స్పష్టం చేశారు.

దేశీయంగా సాగుతున్న డ్రగ్స్ ‌దందాలో ఆంధ్రప్రదేశ్‌ ‌పేరు ఎందుకునానుతోందన్నారు.  పక్కరాష్టాల్ర పోలీస్‌ అధికారులు పదేపదే ఏపీపేరు ఎందుకు చెబుతున్నారు. అదే ఆందోళనను ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంపార్టీ ఇక్కడ వ్యక్తపరిస్తే, అదితప్పా?  గంజాయి, ఇతరమాదకద్రవ్యాల బారినపడకుండా, యువత నిర్వీర్యం కాకుండా కాపాడే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తనభుజస్కంధాలపై వేసుకోవడం తప్పా? పొరుగురాష్ట్రంలో ముఖ్యమంత్రి గంజాయిసాగు, రవాణా అమ్మకంపై కఠినచర్యలు తీసుకుంటుంటే, ఈ ముఖ్యమంత్రి డ్రగ్స్ ‌పై మాట్లాడుతున్న తెలుగుదేశం నేతలపై అక్రమకేసులు పెట్టి, జైళ్లకుపంపుతూ రాక్షసానందం పొందుతున్నాడని మండిపడ్డారు.

వైసీపీప్రభుత్వం డ్రగ్స్ ‌మాఫియాను పెంచిపోషిస్తూ, దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న తెలుగుదేశాన్ని నిలువరిం చాలను కోవడం మూర్ఖత్వమే అవుతుంది. ? డీజీపీ కార్యా లయంలో పీఆర్వోగా పనిచేస్తున్న వ్యక్తి, టీడీపీ కార్యాలయంపైకి దాడికివచ్చి, తమనేతలకు పట్టుబడినప్పుడే, తెలుగుదేశంపార్టీ కార్యాలయంపై, సిబ్బందిపై దాడిఘటనలో ఎవరి ప్రమేయముందో స్పష్టమైపోయిం దన్నారు.  పార్టీ కార్యాలయంలో మొత్తం సీసీకెమెరాలు ఉన్నాయి.  దాడికిపాల్పడిన వారిలో దాదాపు 10మంది పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్నారనే సమాచారం మాకుంది.  జరిగిన దాడిఘటనపై  ఈ పోలీస్‌ ‌యం త్రాంగం టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ‌పైపెట్టిన సెక్షన్లు, నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌చూస్తుంటే, పోలీసులకు భంగపాటు తప్పదనిపిస్తోందన్నారు.

ఎప్పుడో రాత్రి8.30 ని.లకు లోకేశ్‌ ‌కార్యాలయా నికివస్తే, సాయంత్రం 6.30నిలకు ఆయన, కార్యాలయంలో పట్టు బడిన వ్యక్తిపై దాడిచేశాడని ఎఫ్‌ఐఆర్లో నమోదు చేశారు. ? మా సిబ్బందికి పట్టుబడిన వ్యక్తి నక్సల్స్ ‌యాంటీవిభాగంలో పనిచేసే వ్యక్తిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.  ఈ కేసుకి  సంబంధించిన మూలాలను తేల్చడంకోసం అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్‌ ‌చేస్తుందన్నారు.  తాడేపల్లిలోని సెల్‌ ‌టవర్‌ ‌మొదలుకొని, విజయవాడ సపంలోని సెల్‌ ‌టవర్‌ ‌పరిధిలోని కాల్‌ ‌రికార్డస్ ‌ను కూడా నమోదుచేయాలని డిమాండ్‌ ‌చేస్తాం. ? పోలీస్‌ ‌వ్యవస్థపై ఉన్న గౌరవమర్యాదలను ఇప్పుడున్న వారు మంటగలుపుతున్నారు.  సామాన్యప్రజలు గర్వించేలా పనిచేసిన ఏపీ పోలీస్‌ ‌వ్యవస్థనేడు జాతీయస్థాయిలోనే అట్టడుగుస్థాయికి దిగజారింది. అందుకుకారణమెవరో పోలీసులే ఆలోచించాలి.

పోలీస్‌ అమరవీరులఆత్మలు క్షోభించేలా నేడురాష్ట్రం లోని పోలీస్‌ ‌శాఖ ప్రవర్తిస్తోంది.   పైస్థాయిలో ఉన్న అధికారులఆదేశాలతో కిందిస్థాయిలో ఉన్న సామాన్యపోలీసుల అంతర్మథనంతో నలిగిపోతున్నారు. ? రాష్ట్రంలోని పోలీసులు వారి కుటుంబసభ్యులను అడిగితే, వారే సమాధానం చెబుతారు.. సమాజంలో మాదకద్రవ్యాలు, గంజాయిని విచ్చలవిడిగా వదిలేయాలో వద్దో,ఉద్యోగాలు లేక నిరాశానిస్ప•హ ల్లో మునిగిపోతున్న యువతను, పాఠశాలల పిల్లలను మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేయడం ఎంతవరకు సమంజసమో, పోలీసు కుటుంబాల్లోని వారే సమాధానంచెబుతారు. రాష్ట్రంలో చలామ ణీ అవుతున్న మాదకద్రవ్యాలు, గంజాయి వ్యవహారంపై ప్రభు త్వం తక్షణమే సీబీఐ విచారణకోరాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వం ధైర్యంగా ఆపనిచేస్తే, అసలు దోషులెవరో ప్రజలకు కూడా తెలుస్తుంది.

టీడీపీ కార్యాలయంపై దాడికి వచ్చిన వారిని స్వయంగా డీఎస్పీస్థాయి అధికారి ఎస్కార్ట్ ‌చేయడాన్ని కూడా తాముగమనించామన్నారు.  తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత  ఈప్రభుత్వం పెట్టినతప్పుడుకేసులున్నింటిపై సమగ్రమై న దర్యాప్తుజరిగి తీరుతుంది.? అప్పుడు అసలు దోషులెవరో, వారి వెనకుండి వారిని  నడిపించినవారెవరో తేలుతుందని పయ్యావుల అన్నారు.

Leave a Reply