Take a fresh look at your lifestyle.

కొరోనా కథా కొనసాగితే..

జనవరి 30 రోజున మొదటి కొరోనా కేస్‌, ఇం‌డియాలో బహిర్గతమైంది. ఆ రోజు నుంచి కొన్ని చర్యలు ప్రారంభమయ్యాయి. మొదటి చర్యగా మాస్కులు ధరించడం, నెక్సట్ ‌కరచలనాలు మానివేయడం, చేతులను శుభ్రపరుచుకోవడం. ఇలా చేపట్టిన చర్యలు నాకు తెలిసి క్రమంగా తీవ్రమయ్యాయి. అంటే వ్యాధి యొక్క వ్యాప్తి ప్రభావం చూపించడం మొదలైంది. తర్వాత మనుషులు ఒకరినొకరు తాకకుండా సోషల్‌ ‌డిస్టెన్స్  ‌పాటించడం, స్కూలు పాఠశాలలు థియేటర్లు, పబ్లిక్‌ ‌ప్లేసులో మీటింగులు, పెళ్లిళ్లు, పార్టీలు వంటివి నిషేధించడం పదోతరగతి పరీక్షలు పోస్ట్‌పోన్‌ ‌చేయడం, ఇప్పుడు పోలీసులని ఆర్మీని మోహరించి ఎయిర్‌ ‌పోర్టుల్లో రైల్వేస్టేషన్లలో తనిఖీ చేపట్టడం విదేశాల నుంచి వచ్చిన వాళ్లను 14 రోజులు పూర్తిగా ఐసోలేషన్‌లో  ఉంచటం, బయటి నుంచి ఎవరిని మన ఇంటికి రానివ్వకుండా, మనము ఎవరి ఇంటికి పోకుండా ఒక విధమైన నిర్బంధాన్ని పాటించడం, మార్చి 22 నాడు రోజు జనతా కర్ఫ్యూ పేరిట కేంద్ర ప్రభుత్వము 14 గంటలు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 24 గంటలు కర్ఫ్యూ విధించి ఏ విధమైన జన సంచారం లేకుండా చూడటం ఆ తర్వాత  కేంద్ర ప్రభుత్వం మార్చ్ 24 అర్ధ రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల వరకు, తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ 15 ‌వరకు లాక్‌ ‌డౌన్‌..‌ప్రకటించడం .ఇప్పటివరకు మన  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం గానీ ..ప్రజలు కానీ పాటిస్తున్న జాగ్రత్త చర్యలు.

ఇక వ్యాధిగ్రస్తులు సంఖ్యాపరంగా చూస్తే భారతదేశంలో కరోనా వైరస్‌ ‌బాధితులు 904 కు చేరుకుంది. సంఖ్య పెరుగుదల గనుక మనం ఒకసారి పరిశీలిస్తే జనవరి 30వ తారీకు నుండి మార్చి 28 వరకు ఇండియా మొత్తంలో 904 కరోనా పాజిటివ్‌ ఏర్పడితే అందులో 83 మంది పూర్తిగా కోలుకోగా ..19 మరణాలు సంభవించినాయి. ఇవన్నీ అఫీషియల్‌ ‌లెక్కలు అంటే ఇంకా పరీక్ష చేయించుకొని వాళ్ళలో ఎంతమంది పాజిటివ్‌గా ఉన్నారు అని మనకు తెలియదు. వారందరూ మిగతా వాళ్ళకి వైరస్‌ ‌వ్యాప్తి చేసే వాహకాలుగా పిలవబడతారు. ఇది ఇప్పటివరకు వాస్తవంగా జరిగిన అంశము. దీన్ని ఇంకొంచెం ముందు చూపుతోటి తీవ్రత ఇలాగే కొనసాగితే ఏం జరుగు తుంది..అన్న అంశంపై దృష్టి పెట్టాల్సిన అవస• •ముంది. ఒకవేళ వ్యాధి తీవ్రత కొనసాగితే జరిగే పరిణామాలు నా ఊహగా మాత్రంగా మీతో పంచుకుంటున్నాను.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కర్ఫ్యూ వాతావరణం ఇలాగే కొనసాగితే …పాలు కూరగాయలు, ఉప్పు, పప్పు లాంటి నిత్యవసర వస్తువులు మన ఇళ్ళల్లో అయిపోతే అవి పొందటానికి కూడా మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. గవర్నమెంట్‌ ‌దగ్గర రెవెన్యూ తగ్గిపోతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇంకా..ప్రభావవంతంగా తీసుకునే అవకాశం ఎంత ఉందో అలా జరగకపోవడానికి కూడా ఎంతో కొంత అవకాశం ఉంది.ఒక వేళ డెత్‌ ‌పర్సెంట్‌ ‌రెండుగా ఉన్నా కూడా 130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో కనీసం రెండున్నర కోట్ల మంది ఈ వైరస్‌ ‌వల్ల మరణించే అవకాశం ఉంది. అంటే రెండున్నర కోట్ల కుటుంబాలు కుటుంబ సభ్యుల్ని కోల్పోతాయి. ఇంట్లో నుండి బయటకి వెళ్లకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య లేదా మనుషుల మనసుల్లో మానసిక అలజడులు ఏర్పడతాయి. మన భారతదేశం సాధారణంగానే సామాజికంగా చాలా సంబంధాలు కలిగిన దేశం. ఈ సోషల్‌ ‌డిస్టెన్స్ అనేది క్రమక్రమంగా మన మనసుని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. మన మిత్రులను, కుటుంబ సభ్యులను, పక్క తమ్ముళ్లను, అమ్మ నాన్న లేని మనం కలవకపోవడం ప్రారంభంలో వ్యాధి జాగ్రత్తగా అనిపించినా తర్వాత తర్వాత దూరం అనేది మన మనసులో అలాంటి ఇబ్బంది కలుగజేస్తుంది. రోజుకు ఎనిమిది గంటలు పని చేసే వ్యక్తులు పనులన్నీ మానేసి ఇంట్లో ఉండడం వలన మానసిక శారీరక శక్తులు నిర్వీర్యం అయిపోతాయి. దానివలన అలజడి అనేది ఎక్కువ అవుతుంది. కొన్ని సార్లు కరోనా భయం పరిస్థితుకు, సూసైడల్‌ ‌టెండెన్సీ కూడా తెవొచ్చు. ఇదంతా మానసిక పరమైనది. ఇంకా గట్టిగా వివరించాలని ఉంది కానీ మన మనసులు వాటిని అంగీకరించి లేవు.

ఇక సామాజిక పరిణామాల విషయానికి వస్తే చాలా మంది పనిమనుషులని గాని, చాకలి వాళ్ళని గాని, ఇతర పని వారిని గాని అవగాహన ఉన్న వాళ్ళు పనిలో నుండి తీసేస్తారు. దాని వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఆదాయం తగ్గి పోతుంది. ఒక రెండు నెలల వరకు ఉద్యోగులకు జీతాలు రావచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్‌ ‌దగ్గర కూడా ఉన్న డబ్బుని ఆలోచించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల మీకు అవసరమైన రేషన్‌ ‌మేమే ఇస్తాం కానీ శాలరీ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉంది. మన బ్యాంకు లోన్లు, పెట్టుబడులు పొదుపు, ఇవన్నీ అసలు ఆలోచించే పరిస్థితిలో మనం ఉండం. కేవలం ప్రాణాలతో ఉంటామా లేదా అన్న ఆలోచన మాత్రమే వస్తుంది.
ఇక కింది వర్గపు ప్రజల విషయానికి వస్తే వాళ్ళకి మనం పని ఇవ్వలేనప్పుడు వారికి ఆదాయం ఉండదు. తద్వారా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరవు. మనలాంటి అధిక జనాభా ఉన్న దేశాల్ల్ణో కరోనా చావుల కంటే ముందు ఆకలి చావులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో పేదరికం స్థాయి కూడా ఎక్కువగానే ఉంది. కొన్ని వర్గాల వారు తిండి దొరక్క కిరాణా సామాన్లు కొనిపెట్టుకున్న అత్యధిక ఆదాయ వర్గాల వారిపై లేదా ఉన్నత వర్గాల వారిపై గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేసి తిండి పదార్థాలు ఎత్తుకు పోయే అవకాశం కూడా ఉంది.

ఇంకో ముఖ్య విషయం, మన సెల్‌ ‌ఫోన్‌ ‌టవర్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ‌పోయే అవకాశం ఉంది. అదే దుస్థితి వొస్తే ఎలక్ట్రిసిటీ, సెల్‌ ‌ఫోన్స్ ‌దూరమైతే ప్రపంచానికి మనకి మధ్య సంబంధం ఉండదు. ఇప్పుడు మనందరం కలవకపోయినా మన సంబంధాలను ఈ ఉపకరణాలు ద్వారా కాపడుకుంటున్నాము. ఇంటర్నెట్‌, ‌సెల్‌ఫో•న్‌ ‌గాని ఒకసారి బంద్‌ అయితే మనుషుల మధ్య ఏ విధమైన సంబంధం ఉండదు. ఇప్పుడు మనము పెళ్లిళ్లు, పార్టీలు వంటి సంతోషకరమైన సమయానికి వెళ్లలేక పోతున్నాము కానీ భవిష్యత్తులో సంబంధితులు మరణిస్తే కూడా వెళ్లలేని రోజులు వస్తాయి. ఇప్పుడు ఇటలీలో ఆర్మీ చేసే పని అత్యంత విషాద కరమైనది. అది మామూలుగా దేశ రక్షణ కోసం యుద్ధం చేసే సైనికులు అందరూ అక్కడ చనిపోయిన శవాలను ఏరివేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అత్యంత హీనమైన స్థితి ఇటలీ వాళ్లది. ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్‌ ‌రాకముందు.. కరోనా వైరస్‌ ‌వచ్చిన తర్వాత … చరిత్రగా మారిపోతుంది.

నిజాయితీగా చెప్పాలంటే ఇది ప్రకృతి తనకు తానుగా చేసుకునే బ్యాలెన్స్. ‌బ్యాలెన్స్ ‌చేస్తున్నప్పుడు లేదా సంతులనాన్ని చేస్తున్నప్పుడు అధికంగా ఉన్న కొన్ని వ్యర్థాలను తీసేయాల్సి వస్తుంది. అవి తీసేస్తేనే బ్యాలెన్స్ ఉం‌టది. భూమిపై పెరిగిన ఒత్తిడిని భరించలేని ప్రకృతి తనకు తానుగా చేసుకునే కార్యక్రమమే ఈ కరోనా కావచ్చు. మనందరం దేశం కోసం మనసులు కలిపి, శరీరాలను దూరంగా ఉంచి దేశాన్ని జనాభాను కాపాడుకుందాం..
– శ్రావణసంధ్య

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!