Take a fresh look at your lifestyle.

సరిహద్దులు దాటితే ..!

తిప్పణి 

తెలంగాణ సరిహద్దు రాష్ట్రం మహారాష్ట్ర లో పెరుగుతున్న కొరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం మహారాష్ట్ర లో 55 వేల కొరోనా కేసులు నమోదయ్యాయి . శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే పరిస్థితి చేజారి పోతుందని ..వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ లాంటి చర్యలు ఈ రోజు తీసుకోక పొతే ..రేపు ప్రజలే స్వచ్చందంగా లాక్ డౌన్ ప్రకంటించుకునే అవకాశముందని అన్నారు.మరో వైపు  తెలంగాణ  రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి అదుపులో ఉందని..ఈ రోజు కొరోనా బాధితులకు పి పి ఈ కిట్స్ లేకుండానే డాక్టర్లు వైద్యం అందిస్తున్నారనీ ..ప్రజలు కొరోనా వ్యాధిని ఇతర జబ్బుల మాదిరిగానే భావిస్తూ ..కోవిడ్ బారిన పడ్డ తమ సన్నిహితులకు సేవలందిస్తున్నారని అన్నారు.లాక్ డౌన్ ..కర్ఫ్యూ ల అవసరం లేదని రాజేందర్ అభిప్రాయం.   తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య మూడు  వేలు దాటి శనివారం 3187 నమోదు అయ్యాయి మహారాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ పై  ఆదివారం నిర్ణయం తీసుకోనుంది. .తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాక్సిన్ కొరత పై కేంద్రానికి లేఖ రాసారు . శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్ సమావేశంలో వాక్సిన్ కొరత పై ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply