Take a fresh look at your lifestyle.

40 ఎకరాలు అమ్మితేనే 2 వేల కోట్లు వొచ్చినయి

  • అది ప్రజా ధనం.. ప్రజా సంక్షేమం కోసమే వినియోగం
  • రైతుబంధు తరహాలో నేత కార్మికులకు బీమా
  • చేనేత వర్గాలకు రాజకీయ చేయూత
  • వారి అభివృదికి ఎంతో చేయాల్సి ఉంది
  • రాష్ట్ర అభివృద్ధికి అనుగుణంగా ప్లాన్‌
  • ‌ప్రగతి భవన్‌లో రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కెసిఆర్‌
  • ‌నిబద్ధత కలిగిన రాజకీయ నేత అని కితాబు

రాష్ట్రంలో చేనేత వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని..దీనికి సంబంధించి త్వరలోనే శుభవార్త అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రకటించారు. చేనేతల అభివృద్ధి కోసం చాలా చేశాం.. కానీ సరిపోవడం లేదు.. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. చేనేతల బాధలను విముక్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమక్షంలో ఎల్‌ ‌రమణ టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌మాట్లాడుతూ రమణ తనకు మంచి మిత్రుడని, నిబద్ధత గలిగిన రాజకీయ నేత అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారానికి రమణ టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

రమణకు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉం‌టుందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణ చేరికతో తీరిందన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు రైతుబీమా తరహాలో బీమా  కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒకట్రెండు నెలల్లో చేనేతలకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. వరంగల్‌ ‌జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూరత్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చేనేత కార్మికుల సమస్యలపై సూరత్‌కు అధికారులు పంపామని గుర్తు చేశారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే తిరిగి వొస్తామని చెప్పారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్ ‌టైల్స్ ‌పార్కు ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వొస్తున్నారని, ఒక పారిశ్రామికవేత్త 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నీటి పారుదల రంగంలో నేరపూరిత నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం అన్నారు.

ఈ క్రమంలో రాష్ట్ర ఏర్పాటు కంటే ఆరు నెలల ముందే తెలంగాణ పునర్నిర్మాణం గురించి చర్చలు జరిగాయన్నారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌, ఆర్‌ ‌విద్యాసాగర్‌ ‌రావు సమక్షంలో మిషన్‌ ‌కాకతీయ వంటి పథకాలకు రూపకల్పన చేశామన్నారు. ఇప్పుడు ఈ పథకం అద్భుతంగా అమలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని కేసీఆర్‌ ‌తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారు. చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బకొడుతుంది. అందుకనే అజెండా ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి ముందుకెళ్తున్నామని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు అయితే ధనిక రాష్ట్రంగా మారుతామని రాష్ట్రం ఏర్పడక ముందే చెప్పానని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. ఇండియాలోనే నంబర్‌ ‌వన్‌ ‌జీతాలు ఇస్తామని చెప్పాం. అది జరుగుతుంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారు. నిన్న 40 ఎకరాలు అమ్మితే రూ. 2 వేల కోట్లు వొచ్చాయి. ఇలా వొచ్చిన ప్రజా ధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని తేల్చిచెప్పారు. తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ధరణి పోర్టల్‌ అం‌దుబాటులోకి వొచ్చిన తర్వాత భూ వివాదాలు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు. తాను ఏ తెలంగాణను కోరుకున్నానో.. అది ఆవిష్కరించి తీరుతానని, రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్‌ ఉం‌టుందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ వయసులో తనకు వేరు కోరికలు కాంక్షలు కూడా లేవన్నారు. తెలంగాణలో వనరుల కొదవ కూడా లేదన్నారు. రాజకీయాల్లో చేనేతలకు వాయిస్‌ ‌కావాలనే ఎల్‌ ‌రమణను పార్టీలో చేర్చుకున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌రమణకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మాట్లాడిన సీఎం.. ఎల్‌ ‌రమణ విషయంలో త్వరలో గుడ్‌ ‌న్యూస్‌ ‌వింటారన్నారు. అంతేకాదు ..

తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏంటో అందరికీ తెలుసునని అన్నారు. కొద్ది మంది సన్నాసులకు ఏమి చెప్పినా అర్థం కావడం లేదు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం పేద రాష్ట్రం కాదు.. ధనిక రాష్ట్రంమని తెలిపారు కేసీఆర్‌. ‌త్వరలో చేనేత పెద్దలను పిలిచి సుదీర్ఘ వి•టింగ్‌ ‌పెడతానని.. ఏమి చేస్తే బాగుంటుందో చర్చిద్దామన్నారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేతుల వి•దుగా ఎల్‌ ‌రమణ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply