Take a fresh look at your lifestyle.

కామారెడ్డి, ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలు గుర్తింపు

భైంసాలో ఇద్దరు మృతి

మహారాష్ట్ర సరిహద్దుల్లో కొరోనాతో పాటు, బ్లాక్‌ఫంగస్‌ ‌కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదిలాబాద్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో ఈ రకం లక్షణాలతో వైరస్‌ ‌బయటపడింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కలకలం రేపుతోంది. బీర్కూర్‌ ‌మండలం బరం గెడిగిలో ఓ వ్యక్తికి బ్లాక్‌ ‌ఫంగస్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. సదరు వ్యక్తికి కొరోనా తగ్గాక బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌సోకినట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితుడికి చికిత్స జరుగుతోంది. ఇకపోతే ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే 16 మంది మృతి చెందారు. కాగా.. గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 615 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాను బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌హడలెత్తిస్తోంది. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌లక్షణాలతో నిర్మల్‌ ‌జిల్లా భైంసా డివిజన్‌లో ఇద్దరు మృతి చెందారు.

ఆదిలాబాద్‌ ‌జిల్లా బోథ్‌ ‌ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందింది. అలాగే పలువురు బాధితులు కంటి చూపు కోల్పోయారు. బ్లాక్‌ ‌ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.  అలాగే పలువురు బాధితులు కంటి చూపు కోల్పోయారు. బ్లాక్‌ ‌ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Leave a Reply