Take a fresh look at your lifestyle.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..కేరళ, తమిళనాడు అంగన్‌వాడీలు

“అం‌గన్‌వాడీల పరిస్థితి మెరుగుపడటానికి తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలకు పాఠాలు చెప్పొచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఎంతో మెరుగుగా ఉన్నాయి. పౌష్టికాహార కార్యక్రమాలు, బోధన, ఉపాధ్యాయ శిక్షణ, వర్క్ ‌షాపుల విషయంలో ఈ రెండు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు. సమగ్ర శిక్షణ, సామాజికవర్గాలను సమీకరించడం, వాటికి పని కల్పించడం వంటి చర్యల వల్ల కేరళ, తమిళనాడులలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనితీరు బాగా పెరిగింది.”

అంగన్‌వాడీల పరిస్థితి మెరుగుపడటానికి తమిళనాడు, కేరళ ఇతర రాష్ట్రాలకు పాఠాలు చెప్పొచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఎంతో మెరుగుగా ఉన్నాయి. పౌష్టికాహార కార్యక్రమాలు, బోధన, ఉపాధ్యాయ శిక్షణ, వర్క్ ‌షాపుల విషయంలో ఈ రెండు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు. సమగ్ర శిక్షణ, సామాజికవర్గాలను సమీకరించడం, వాటికి పని కల్పించడం వంటి చర్యల వల్ల కేరళ, తమిళనాడులలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనితీరు బాగా పెరిగింది. ఈ విషయాలు 50 పైగా కార్యక్రమాలలో బాలల ఆరోగ్య సంరక్షణ,పౌష్టికాహార కార్యక్రమాల అమలు విధానంలో కొత్త పుంతలు, ఇందుకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను పరిశీలించిన మీదట ఈ అభిప్రాయానికి వచ్చాం.వాటి ఖర్చు వివరాలు, వనరుల సమర్థ వినియోగం వివరాలు దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ఒక సిలబస్‌ ‌వంటివి. అంగన్‌వాడీల్లో ఖాలీలు ఎక్కువగా ఉంటున్నాయి. సరైన శిక్షణ లేకపోవడం, అజ్ఞాత లబ్ధిదారులు పెరిగిపోవడం, సరుకులు, సామగ్రికొరత వంటి సమస్యలను అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్నాయి. అంగన్‌వాడీల్లో అనుబంధ పౌష్టికాహార కార్యక్రమం, ప్రీస్కూల్‌ ‌విద్య, ఆరోగ్య పౌష్టికాహార మార్గదర్శనం, టీకాలు వేయడం, ఆరోగ్య పరీక్షలు 88 మిలియన్‌ ‌లబ్ధిదారులకు (ఆరేళ్ళ లోపు వారికి) రిఫరల్‌ ‌సేవలు, గర్భిణులకు,బాలింతలకు సాయం అందించడం వంటివి అంగన్‌వాడీ కేంద్రాల కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. ఈ అంగన్‌వాడీ కేంద్రాలను కేంద్రం సమీకృత శిశు సంక్షేమ సేవా కార్యక్రమం కింద నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దేందుకు దీనిని ప్రారంభించారు.

మన దేశంలో పౌష్టికాహర లోపంగల పిల్లలు 46.6 మిలియన్‌ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి సంఖ్యలో దాదాపు మూడో వంతు అంటే 25.5 మిలియన్‌ ‌పిల్లలు నిరుపయోగులని గ్లోబల్‌ ‌న్యూట్రిషన్‌ ‌నివేదిక – 2018 పేర్కొంది. వీరు తమ వయసుకు తగినట్టుగా ఉండరనీ, పొట్టిగానూ,తక్కువ బరువు కలిగి ఉంటారని ఆ నివేదిక పేర్కొంది.ఇలాంటి పరిస్థితులతో బాల్య దశలోనే మరణాలు సంభవిస్తున్నాయని వివరించింది. పసిపిల్లల సంరక్షణకు మన దేశంలో అంగన్‌వాడీలు, ప్రైవేటు ప్రీస్కూల్స్ ‌వెలిశాయి. బాల్యంలోనే పిల్లల సంరక్షణ పట్ల,వారి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళ, తమిళనాడులలో శిశు సంక్షేమ విభాగాలను మహిళలే నడుపుతున్నారు. సూపర్వైజర్లు, కార్యకర్తల సమన్వయ సహకారాలతో వీటిని నడుపుతున్నారు. తీవ్రమైన సమస్యలపై తరచూ చర్చిస్తూ ఉంటారు.మేము రోజూ విధులకు హాజరు కాగానే అందరం కలిసి మాట్లడుకుంటాం,ఆవిష్కరణలు, కొత్త విషయాల గురించి చర్చించుకుంటాం అని తిరువళ్ళూరులోని శిశుసంక్షేమ ప్రాజెక్టు అధికారిణి పుష్పలత పేర్కొన్నారు. తిరువళ్ళూరు చెన్నైకి 45 కిలో మీటర్ల దూరంలో ఉంది.ఈ చర్చలు అరమరికలు లేకుండా సాగుతాయనీ,తమ మనసులోని అభిప్రాయాలను అందరూ వెల్లడిస్తారనీ,అందుకు తగిన స్వేచ్ఛ వారికుందని ఆమె చెప్పారు.

ఈ రెండు రాష్ట్రాల్లో ఒక నెల కోర్సు ఇస్తారు. ఆ సమయంలో ఆరోగ్య, ఇతర శాఖలు కోర్సును నిర్వహిస్తుంటాయి. రిఫ్రెషర్‌ ‌ట్రెయినింగ్‌ ‌కార్యక్రమాన్ని రెండేళ్ళకోసారి నిర్వహిస్తారు. సూపర్వైజర్లు, కార్యకర్తలు కలిసి కూర్చుని చర్చిస్తుంటారు. అంగన్‌వాడీలను ఉన్నపళంగా సందర్శిస్తుంటారు. తమిళనాడులో వికేంద్రీకరణ శిక్షణా కార్యక్రమం అమలులో ఉంది. అట్టడుగు స్థాయి వారికి శిక్షణ ఇచ్చేందుకు ఇది అమలవుతోంది. ఒక్కొక్క బ్లాకులో ట్రెయినింగ్‌ ‌టీమ్‌ ‌పని చేస్తుంది.కేరళలో జిల్లాకు ఒకటి చొప్పున 14 శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. తమిళనాడులో ప్రీస్కూల్‌ ‌కిట్‌,‌పాఠ్యప్రణాళిక అంగన్‌వాడీలలో బోధిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన సర్వశిక్ష అభియాన్‌ ‌కార్యక్రమం ప్రతినిధులు, టీచర్లతో చర్చలు జరుపుతారు.వారు అంగన్‌వాడీ కార్యకలాపాల రూపకల్పన చేస్తారు.సార్వత్రిక ప్రాథమిక విద్యా కార్యక్రమంలో భాగంగా ఇది అమలు అవుతోంది.
కాంచీపురంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు పొదుపు అలవాటు చేయడానికి పిగ్మీ బ్యాంకును నడుపుతున్నారు. రిటైర్‌ అయిన తర్వాత అంగన్‌ ‌వాడీల టీచర్లకూ, పిల్లలకు సేవలందించడం ఒక మంచి కార్యక్రమంగా తీసుకున్నట్టు కేరళలో బిందు అనే మాస్టర్‌ ‌ట్రెయినర్‌ ‌తెలిపారు.

దేశంలోని అంగన్‌వాడీల్లో ఖాలీలు ఎక్కువగా ఉన్నాయి.బీహార్‌లోని 26,835 అంగన్‌వాడీల్లో 11,009 ఖాళీలున్నాయి. దేశం మొత్తం మీద అంగన్‌ ‌వాడీల్లో ఎక్కువ ఖాలీలు ఉన్న రాష్ట్రం ఇదే తమిళనాడు, కేరళలలోనూ ఇదే పరిస్థితి. కేరళలో టీచర్‌ ‌బ్యాంకులు ఏర్పాటు చేశారు.ఆసక్తి గల అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి, వారికి ఇంటర్వ్యూలు పూర్తి చేసి బ్యాంకుల్లా కొనసాగిస్తారు. అవసరమైనప్పుడు అవసరమైన చోట్లకు వారిని పంపిస్తూ ఉంటారు. నిర్లక్ష్యానికి గురి అయిన వర్గాలలో ఈ కార్యక్రమం గురించి అవగాహన పెంచడం, తగిన శిక్షణ ఇవ్వడం,అధ్యయనాలకు తోడ్పడటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పంచాయతీ సభ్యులకూ, వయోజనులకు ఈ కార్యక్రమాలపై అవగాహన పెంచుతారు.

కేంద్రం పోషణ్‌ అభియాన్‌ ‌కార్యక్రమాన్ని 2018లో ప్రవేశపెట్టింది. అట్టడుగు వర్గాల్లో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ మాటకు వస్తే ఈ కార్యక్రమాన్ని చాలా కాలం ముందే అమలులో పెట్టినట్టు శ్రీ పెరంబుదూరులో ప్రాజెక్టు అధికారిణి మాలతి చెప్పారు.తమిళనాడు,కేరళలో అక్షరాస్యత శాతం ఎక్కువ. తమిళనాడులో 80 శాతం, కేరళలో 94 శాతం.తాము తరచూ అందరితో ఇష్టాగోష్ట్టులు, చర్చలు ఏర్పాటు చేస్తుంటామనీ, మరింత మెరుగైన రీతిలో ఈ కార్యక్రమాల అమలు కోసం సలహాలు,సూచనలు తీసుకుంటామని ఆమె చెప్పారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల భోజనానికి కూరగాయలు, పప్పుదినుసులు గ్రామస్థులు తెచ్చి ఇస్తారని చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల్లో జేన్‌‌డ్రెజ్‌, అమర్త్యసేన్‌ ‌బోధనల ఆధారంగా రాష్ట్ర విధానాలను రూపొందించి అమలు జేస్తున్నారు.
– స్క్రోల్‌.ఇన్‌ ‌సౌజన్యంతో..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply