Take a fresh look at your lifestyle.

ఇడ్డూరం.. వింతైన వేళ

ఇప్పుడు ఇంతకూడ ఇగురం లేని
సంగతులు కళ్లముందు పొరలు పొరలుగా
ఊడిపోతున్న మిన్నకుండి నోళ్ళు వెళ్ళబెట్టడం తప్ప..ఇప్పుడు ఏమీ చేసే తీరుబాటు లేకపాయే…
స్వార్ద పునాదులు పెకిలిస్తమని బెదిరింపులకు
వెన్నుంటారని బావించినోల్ల వెన్నులో వణుకు పుట్టించి ….భవిష్య రాజకీయ సింహాసన ఎరను వేసి
చివరకు ఏ కాకి చేసిన ఆటలో ప్రతి నాయకుడు…బలి కాక తప్పదు..
ఊహించని కేసులు పాములా మెడను చుట్టి
పత్రికలలో ఊపిరాడనీయక చేయడం తప్పదు..

ఇక్కడ ఆధిపత్య విషనగు పడగ విప్పి
బుసలు కొడుతుంది…
ఏమరుపాటుతో ఏ సొంత నిర్ణయం తాలూకు
పవనాలు వీసిన…పార్టీ సభ్యత్వ భాహిష్కరణ కాటుకు గురికాక తప్పదు….

రాజరికం ముసుగు తొడిగి నడుస్తున్న
కండ్ల ముందు ప్రజాస్వామ్య…
అన్ని తెలిసి కృత్రిమ నవ్వుని మొఖానికి తగిలించుకొని అసమర్థ అవినీతి నీడన
కాలం నెట్టుకొస్తున్న ప్రజా నాయకులార?
ఎంత కాలం ఈ స్వలాభ పదవీకాంక్ష.
స్వామీ కార్య ప్రదక్షిణలు..
అడుగులకు మడుగులోత్తే బాపతుగాళ్లు..
ఏదో ఒక రోజు తమవంతు రాక తప్పదు..

రెండు దశాబ్దాల ఉద్యమ సంద్రంలో ఎన్నో
ఆటుపోట్లు చవిచూసిన అనుభవ నేత్రాలు
కమ్యునిస్టు,సామ్యవాదం కనుపాపలుగా
ప్రజపక్షాం నాగొంతని
ప్రజల కోసమే నా చివరి శ్వాస అని ఎన్నెన్ని
ముచ్చట్లు పత్రికల ముందు కోడై కూసి
తుదకు ఊహించని అలౌకిక జెండా గూటికి చేరిన…తత్వాన్ని చూసి నివ్వెరబోక..
నిట్టూర్పులు ఇడుస్తూ… మిన్నకుండుడు కాక
ఇప్పుడున్న రాజకీయ కీలు బొమ్మలు మరేమీ చేయగలవు?

ఎన్నో ప్రజా గొంతుకలను పంపిన
స్వయానా వచ్చి కలువమని ఆహ్వానించిన
ప్రజా పక్షానికి చేదు అనుభవం మిగిల్చి
ఇప్పుడు ఏక పక్షం కాషాయం గూటికి
బడుగుల ఆశ జ్యోతి ఉన్న ఫలగా చేరినా
సందర్భం..ఎంతైనా ఇడ్డూరం కాక మరేమీ..?

అయ్య ..
మీకు తెల్వంది కాదు..ఈ నేల
త్యాగ వీరులను, ప్రజలకై నేల రాలిన బిడ్డలను దేవుళ్ళుగా కొలుస్తున్న పునీత గడ్డ
ఇట్లాంటి తావులో…కనీసం ఒక్క పూట
నిస్వార్థ ప్రజా వాయువును పిల్చుతే
ఆ మధుర క్షణాల తాలూకు జ్ఞాపకాలు
శరీరాన్ని విడిచిన చరిత్రపుటల్లో అక్షరబద్ధం అవ్వడం ఖాయం…
బానిసత్వం నీడన బతకక బయటకు వచ్చే వరకు
బాగానే ఉంది..
తొందరలో తీర్థం పుచ్చుకునే ముందు నిన్ను నమ్మిన బావాజాల బుద్ధిజీవులా సంగతి కాస్థైనా చూడరా?
రేపు ఏ లెక్కన ఎన్నికల సమరానికి సై అంటరు.
లౌకిక వాయువును పీల్చే ఏ ఒక్క జీవి
అంత సులువుగా గద్దెనెక్కియ్యావు.
జెర్ర..ఆలోచించి
అడుగేస్తే బాగుండని తెలంగాణ అమరుల ఆశయాలు వెయ్యి కండ్లతో చూసిన క్షణం..
భావి తప్పుడు నిర్ణయాల తాలూకు ఓటమిని
చవిచూడక తప్పదేమో?
– నాగరాజు మద్దెల, 6301993211.

Leave a Reply