Take a fresh look at your lifestyle.

ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల మేరకే కొరోనా టెస్టులు

ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కొరోనా టెస్టులు చేస్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. తక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి తక్కువ టెస్టులు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కరోనా రోగుల కుటుంబ సభ్యులకూ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తున్నామని లేదంటే చేయట్లేదని తెలిపారు. రాష్ట్రంలో పూర్తయిన పరీక్షల లెక్కలను సర్కారు అధికారికంగా ప్రకటించట్లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేయట్లేదన్న ఆరోపణలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పందించారు. ఆయుష్‌ ‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేద రక్ష కిట్లను తన ఛాంబర్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ‌వైద్యులకు అందచేశారు. రెడ్‌జోన్‌లో పని చేస్తున్న పోలీస్‌ ‌సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్‌ ‌సిబ్బందికి ఆయుర్వేద రక్ష కిట్లను అందజేయనున్నారు. 20వేల కిట్లను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు.

శనివారం బీఆర్‌కేఆర్‌ ‌భవన్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయుర్వేద రక్ష కిట్లను పోలీసు అధికారులకు అందించారు. హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌జోన్‌ ‌జాయింట్‌ ‌సీపీ విశ్వప్రసాద్‌, ‌తదితరులకు మంత్రి కిట్స్ అం‌దజేశారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తిచెందకుండా ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ ‌సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకొంటున్నది. కరోనా సేవకుల్లో వ్యాధి నిరోధకశక్తి పెరిగేందుకు రాష్ట్ర ఆయుష్‌ ‌విభాగం సిద్ధం చేసిన ప్రత్యేక ఆయుర్వేద రక్ష కిట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రారంభించారు. అనంతరం పోలీసులు, వైద్యులు, శానిటేషన్‌ ‌సిబ్బందికి ప్రత్యేక కిట్లను అందజేశారు. ఒక్కో ఆయుర్వేద కిట్‌లో ఐదు వేర్వేరు ఆయుర్వేద ఆధారిత మందులు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహకరిస్తాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల కిట్లను పంపిణీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

Leave a Reply