Take a fresh look at your lifestyle.

కొరోనా..మరింత తీవ్రం..!

  • భారత్‌లో గరిష్టస్థాయికి చేరుకున్న కేసులు
  • దవాఖానాల్లో పడకలు, వెంటిలేటర్లకు కొరత
  • ఐసిఎంఆర్‌ అధ్యయన వేదిక వెల్లడి

యావత్‌ ‌ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి.. భారత్‌లో నవంబర్‌ ‌మధ్య నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇప్పుడున్న కేసులు తారాస్థాయికి చేరుతాయని భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరత కూడా ఏర్పడనుందని అంటున్నారు. అప్పుడు ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని  పరిశోధకుల బృందం అంచనా వేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ ‌రీసెర్చ్ ‌గ్రూపునకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 8 వారాల లాక్‌డౌన్‌ ‌వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం 36-76 రోజులపాటు ఆలస్యమవుతోందని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్‌డౌన్‌ ఉపయోగపడిందని విశ్లేషించారు. ఇన్ఫెక్షన్‌ ‌రేటును 69-97 శాతం మేర తగ్గించడానికీ లాక్డౌన్‌ ఉపయోగపడిందని లెక్కగట్టారు నిపుణులు. లాక్‌డౌన్‌ ‌తర్వాత సుమారు 60 శాతం మేర ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని తెలిపారు. ఈ ప్రజారోగ్య చర్యలు నవంబర్‌ ‌మొదటి వారం వరకు డిమాండ్‌ను అందుకుంటాయని, అనంతరం కొరత ఏర్పడొచ్చని  పరిశోధకులు అభిప్రాయపడ్డారు.ఆ తర్వాత ఐసొలేషన్‌ ‌పడకలు 5.4 నెలల వరకు, ఐసీయూ పడకలు 4.6 నెలలు, వెంటిలేటర్లు 3.9 నెలల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ ‌విధించకపోయి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్‌తో పోలిస్తే ఇది 83 శాతం తక్కువేనని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం మేర పెంచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలయ్యేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ మహమ్మారి కోసం ప్రజారోగ్య వ్యవస్థపై వెచ్చించే మొత్తం జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఇప్పటికే ఢిల్లీ లాంటి నగరాల్లో వైద్య సదుపాయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రంమంత్రి అమిత్‌ ‌షా సక్షించి తోణ చర్యలకు ఉపక్రమించారు.

Leave a Reply