Take a fresh look at your lifestyle.

లక్షణాలు కనిపించని వారే అసలు సమస్య

  • వారిని గుర్తించడం కష్టంగా మారింది
  • ఐసీఎంఆర్‌ ‌సీనియర్‌ ‌సైంటిస్ట్ ‌డాక్టర్‌ ఆర్‌ఆర్‌ ‌గంగాఖేడ్కర్‌

మనదేశంలో కొరోనా బారిన పడిన 80 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్‌) ‌సీనియర్‌ ‌సైంటిస్ట్ ‌డాక్టర్‌ ఆర్‌ఆర్‌ ‌గంగాఖేడ్కర్‌ ‌విస్మయం వ్యక్తం చేశారు. లక్షణాలు కనిపించిన వ్యక్తులను పరీక్షించగలం. కానీ లక్షణాలే లేకుండా తిరుగు తున్నవారిని ఎలా పట్టుకోగలమని అన్నారు. ఇదే అతిపెద్ద సమస్య అని డాక్టర్‌ ‌గంగాఖేడ్కర్‌ అన్నారు. దేశంలో ఇప్పటిదాకా 17 వేలమందికి పైగా వ్యక్తులకు పాజిటివ్‌ ‌వచ్చింది. వారిలో 543 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి తెలిసిన లెక్కలు. గుట్టుచప్పుడు కాకుండా కొరోనాను మోస్తూ అందరికీ అంటిం చేవారిని పట్టుకోవడం ఎలా ఆని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

భారతీయ వైద్యరంగానికి ఇదొక పెనుసవాల్‌గా మారింది. ఢిల్లీలో ఇటీవల 736 మందికి పరీక్షలు జరిపితే అందులో 186 మందికి పాజిటచివ్‌ ‌వచ్చింది. కానీ వారికి ఆ సంగతే తెలియదు. లక్షణాలు బయటపడ్డవారు ఎవరెవరిని కలిశారు అనేది ఆరాతీస్తూ పోతే ఈ గుంభనపు కేసులు తగులుతున్నాయి. అలాగని దేశ ప్రజలందరికీ కరోనా పరీక్షలు జరపడం అసాధ్యమని ఆయన అన్నారు. అయితే మొత్తంగా వ్యాప్తి తక్కువగా ఉండడం ఆశావహమైన విషయం. మనదేశంలో వైరస్‌ ‌పరాకాష్ట లేదా పీక్‌ ‌సమయపు మరణాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మే రెండోవారంలో మనకు ఓ స్పష్టత వస్తుందని చెప్పారు.

Leave a Reply