Take a fresh look at your lifestyle.

కొరోనాపై పోరుకు ఐసీఐసీఐ భారీ విరాళం రూ.100 కోట్లు ప్రకటించిన ఐసిఐసిఐ బ్యాంక్‌

కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ ‌బ్యాంక్‌ ఐసీఐసీఐ గ్రూప్‌ ‌వంద కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో రూ.80 కోట్లు పీఎంకేర్స్‌కు, రూ.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థలకు అందిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సందీప్‌ ‌బాత్రా ప్రకటించారు. కార్పొరేట్‌ ‌సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళాన్ని అందిస్తున్నామని చెప్పారు. తాము ఇప్పటికే 2.13 లక్షల సర్జికల్‌ ‌మాస్కులు, 40వేలకు పైగా ఎన్‌95 ‌మాస్కులు, 20వేల లీటర్ల శానిటైజర్లు, 16వేల గ్లౌజ్‌లు, 5300 వ్యక్తిగత రక్షణ సూట్లు (పీపీఈ), 2600 ప్రొటెక్టివ్‌ ఐ ‌గేర్‌, 50 ‌థర్మల్‌ ‌స్కానర్లు, వెంటీలేటర్లను వివిధ దవాఖానలకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అందించామని చెప్పారు.

Leave a Reply