తీగుల్‌లో ఇబ్రహీం కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న దోస్తులు జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామానికి చెందిన ఇబ్రహీం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి దోస్తులు పదో తరగతి స్నేహితులు కలిసి కుటుంబానికి అండగా నిలువాలని నిర్ణయించుకుని తలా కొంత పోగు చేసి స్నేహితుడు ఇబ్రహీం భార్య శాహనబేగంకు రూ. లక్ష రూపాయలను అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా చిన్న నాటి స్నేహితులు మాట్లాడుతూ…చిన్న వయస్సులోనే తోటి మిత్రుడు ఇబ్రహీం మృతి చెందడం బాధకరమన్నారు. ఆ కుటుంబానికి మా వంతుగా ఆర్థికంగా భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, రాజిరెడ్డి, తిరుపతి, శ్రీ ధర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, పరశురాములు, మహేష్, కుమార్, రాజు, శ్రీధర్, టిఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహాయందించిన కాంగ్రెస్ నేతలు..
జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నారాయణ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడు నారాయణ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదాడి జశ్వంత్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తీగుల్ సర్పంచి కప్పర భానుప్రకాష్‌రావు తదితరులు పరామర్శించి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు.