Take a fresh look at your lifestyle.

నేను పోటీ చేయను…

స్థానికంగా ఉండే కేవిఎన్‌ఆర్‌కు అవకాశం ఇవ్వండి
అధిష్టానానికి స్పష్టం చేసిన రాములమ్మ

త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయమై కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌, ‌మెదక్‌ ‌మాజీ ఎంపి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా దుబ్బాకలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ వ్యూ హాత్మ కంగా అడుగులు వేస్తోందా? బలమైన నేతను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని భావిస్తోందా? ఫైర్‌ ‌బ్రాండ్‌ను బరిలోకి దింపనుందా? ఆ మహిళా నేతకు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాపై ఉన్న పట్టే పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తోందా? దుబ్బాక ఉప ఎన్నికల బరిలో రాములమ్మ ఉండనున్నదా? అంటూ…జరుగుతున్న ప్రచారానికి విజయశాంతి ఫుల్‌స్టాప్‌ ‌పెట్టారనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాలు బుధవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధికి వివరించాయి.

దుబ్బాకలో పోటీ విషయమై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు విజయశాంతికి ఫోన్‌ ‌చేసి దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? పోటీ చేయాలనుకుంటే ఆ అవకాశం మీకే ఇస్తాం అని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే,  పోటీపై స్పందించిన విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికలో తాను పోటీ చేయననీ కరాఖండిగా రాష్ట్ర నేతలకు చెప్పారనీ తెలుస్తుంది. తాను పోటీ చేయను  కానీ, స్థానికంగా ఉండే టిపిసిసి ప్రచార కమిటీ సభ్యుడైన కోమటిరెడ్టి వెంకట్‌నర్సింహారెడ్డి(కేవిఎన్‌ఆర్‌)‌కి ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వంతో పాటు ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలకు కూడా విజయశాంతి తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా తన పోటీపై జరుగుతున్న ప్రచారానికి విజయశాంతి ఫుల్‌స్టాప్‌ ‌పెట్టడంతో పాటు దుబ్బాక ఉప ఎన్నికలో తన మనిషిగా కోమటిరెడ్డి వెంకట్‌ ‌నర్సింహారెడ్డి పేరును చెప్పినట్లయింది.

Leave a Reply