Take a fresh look at your lifestyle.

నేనే ఆర్థిక మంత్రిని… లక్ష ఇండ్ల నిర్మాణానికి నిధులిస్తా

త్వరలో అర్హులైనందరికీ ఇండ్లు, రైతుల రుణాల కిస్తీలు మాఫీ
తొగుట సమావేశంలో మంత్రి హరీష్‌రావు

గత ఎనిమిది నెలలుగా కొరోనా కంటికి కునుకు లేకుండా చేస్తుంది. మొన్ననే దుబ్బాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఖాళీ స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపడుతాం. లక్ష ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక మంత్రిగా తానే నిధులిస్తాననీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. బుధవారం సిద్ధిపేట జిల్లా  దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండల కేంద్రంలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో శివసేన జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలకు చెందిన పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, పిఏసిఎస్‌ ‌మాజీ ఛైర్మన్‌ ‌విద్యాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చిక్కుడు లింగం తదితరులు టిఆర్‌ఎస్‌లో చేరారు.

టిఆర్‌ఎస్‌లో చేరిన వీరందరికి మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కొన్ని ఇబ్బందుల వల్ల ఇండ్ల నిర్మాణంలో కొంత ఆలస్యం, ఇబ్బందయిందన్నారు.  అందరూ ఇండ్లు  కావాలని కోరుతున్నారు..త్వరలో అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. తొమ్మిది పనులు చేసిన వాళ్లం పదవ పని చేయమా? కొరోనా విపత్కర సమయంలో ఉచితంగా పప్పు, అదనంగా బియ్యం పంపిణీ చేశామనీ,  చెప్పినవి అన్ని చేశామని, ఇంకా చేస్తామన్నారు. •తుకు 25వేల రూపాయల వరకు పంట రుణం మాఫీ చేశామీ, ఇంకా మిగిలి ఉన్న రుణం డబ్బును కిస్తీల చొప్పున మాఫీ చేస్తామనీ మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply