జిహెచంఎంసి యాక్ట్ ప్రకారం రెండోవారం తర్వాత అన్నా : మంత్రి కెటిఆర్
నవంబర్ 11వ తేదీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని తాను వ్యాఖ్యానించినట్లు కొన్ని వి•డియా సంస్థలు రిపోర్టు చేయడంలో నిజం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండో వారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, అందుకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే తాను అన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని ఆయన తెలిపారు. సదరు వి•డియా సంస్థలు తాను అనని మాటలను తనకు ఆపాదించడం జరిగింది.. అది సరికాదని కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావొచ్చన్నారు. పోరుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలని సూచించారు. సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 91 సీట్లు కచ్చితంగా వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు మారాలి. జనంతో మమేకమై వారితో కలిసి పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సూచించారు.
శాసనసభ్యులకు అభినందన
హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్, దేవరకద్ర శాసనసభ్యులు అల వెంకటేశ్వర్ రెడ్డిల పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ఇరువురి ఎమ్మెల్యేలకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…ఇరువురు ఎమ్మెల్యేలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా మొక్కలు నాటాల్సిందిగా కోరారు.