Take a fresh look at your lifestyle.

నేను చూపించిన పెళ్లికొడుకుని చేసుకుంటేనే కల్యాణలక్ష్మి డబ్బులు ..?

ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు పధకం ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ భవిష్యత్తులో కల్యాణలక్ష్మి పధకం కూడా నేను చెప్పిన పిల్లగాడిని చేసుకుంటేనే డబ్బులు ఇస్తానని అంటారేమో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గరెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.గురువారం అసెంబ్లీ లోని మీడియా కార్యాలయంలో మాట్లాడుతూ ….తెలంగాణ రాష్ట్రం చాల ప్రమాదంలో ఉందన్నారు. తెలంగాణ వస్తే పెరుగన్నం తిని అరుగుల మీద పడుకోవచ్చు అన్నారు కానీ రాష్ట్రంలో పంట నష్టపోతే పరిహారం లేదు రుణాలు మాఫీ లేదని విమర్శించారు.ఎన్నికలకు ముందు మాత్రం రైతు బంధు వేసి అధికారంలోకి వచ్చారని ,ఎన్నికల తర్వాత రైతు బంధు ఏమైందని ప్రశ్నించారు..?రెండోసారి సీఎం అయ్యాక మొదటి విడత రైతు బంధు పూర్తిగా రాలేదని సీఎం కేసీఆర్ కి ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ముందే రైతు బంధు గుర్తొస్తుందని ఆరోపించారు.

ఉమ్మడి జిల్లా మంత్రి హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ట్ కిట్లు పంచిపోవుడే తప్పితే చేసేదేమి లేదని దాతల డబ్బులతోనే కిట్లు పంచుతున్నారని దాతల డబ్బులతోనే ఆర్థిక మంత్రి సాయం చేస్తున్నారని ఈ సారి సంగారెడ్డి లో హరీష్ రావు మీటింగ్స్ కి హాజరైతా రైతు బంధు నిధుల గురించి నిలదీస్తానని అన్నారు.సీఎం రాజకీయ నాయకుడా రైతో చెప్పాలని ,సీఎం అయితే రైతు పక్షాన వెళ్తారని కానీ రైతు బంధు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఏ పంట వేయాలో ప్రభుత్వం చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డరు.

Leave a Reply